ఎన్నారై కుటుంబం దారుణ హత్య.. మానవ మృగానికి మరణ శిక్ష..!

Update: 2022-10-11 23:30 GMT
పాత గొడవలను అడ్డుపెట్టుకుని ఎనిమిది నెలల చిన్నారిని కూడా వదలకుండా అమెరికాలో నివసిస్తున్న ఒక భారతీయ కుటుంబాన్ని ఇటీవల మాన్యుయెల్‌ సల్గాడో అతి దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే.

ఈ కేసులో అతడికి మరణశిక్ష పడుతుందని న్యాయనిపుణులు చెబుతున్నారు. నాలుగు హత్యలకు సంబంధించి సల్గాడోపై వేర్వేరు కేసులు నమోదు పోలీసులు నమోదు చేశారు. అతని సోదరుడు ఆల్బర్ట్‌ సల్గాడోపై సైతం కుట్రకు సహకరించిన నేరం, ఆధారాలు మాయం చేయడం కింద కేసు నమోదు చేశారు.

ప్రధాన నిందితుడు మాన్యుయెల్‌ సల్గాడోపై కిడ్నాప్, హత్య కేసులతో పాటు అక్రమంగా ఆయుధాలు కలిగి ఉండటం, ట్రక్కుకు నిప్పంటించడం లాంటి అభియోగాలు నమోదు చేయనున్నారు. ఈ అభియోగాలు రుజువు అయితే సల్గాడోకు బెయిల్‌ కూడా లభించదు. జీవితాంతం జైలులోనే ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ న్యాయమూర్తి మరణశిక్ష విధించినా ఆశ్చర్యపోనవసరం లేదని.. ఇది న్యాయమూర్తి విచక్షణపైనే ఆధారపడి ఉంటుందని అంటున్నారు.

పంజాబ్‌కు చెందిన ఎన్నారై సిక్కు కుటుంబం అమెరికాలో నివసిస్తోంది. వీరికి ట్రక్కు వ్యాపారం ఉంది. వీరి దగ్గర నిందితుడు మాన్యుయెల్‌ సల్గాడో పనిచేశాడు. జస్దీప్‌ సింగ్‌ (36), అతని భార్య జస్లీన్‌ కౌర్, ఎనిమిది నెలల కూతురు ఆరూహీ ధేరి, దగ్గరి బంధువు అమన్‌ దీప్‌ సింగ్‌ (39)లను తుపాకీ చూపించి మరీ నిందితుడు మాన్యుయెల్‌ సల్గాడో కిడ్నాప్‌ చేశాడు. నలుగురు మృతదేహాలను మెర్స్‌డ్‌ కౌంటీలోని ఓ పండ్ల తోటలో పడేశాడు. నిందితుడిని పోలీసులు అదుపు తీసుకునే సమయంలో ఆత్మహత్యకు ప్రయత్నించాడు. వైద్యం అందడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.


ఈ నేపథ్యంలో నిందితుడు మాన్యుయెల్‌ సల్గాడో(48)పై ఆరు అభియోగాలు నమోదు చేసినట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. తాజాగా వీడియో విచారణ సందర్భంగా.. కేసు తీవ్రత దృష్ట్యా నిందితుడికి తరపున వాదనలు వినిపించేందుకు న్యాయవాది నియామకానికి మెర్స్‌డ్‌ కౌంటీ డిస్ట్రిక్‌ అటార్నీ కార్యాలయం. కేవలం రెండు రోజుల గడువు మాత్రమే ఇచ్చింది.

కాగా సల్గాడో గత చరిత్ర అంతా నేరమయమేనని పోలీసులు చెబుతున్నారు.దొంగతనం, ఆయుధాల చోరీ, అక్రమ ఆయుధాల్ని కలిగి ఉన్న ఆరోపణలు రుజువు కావడంతో పదేళ్లకు పైగా జైలు జీవితం గడిపాడు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News