హోటల్ లో వాస్తు నిపుణుడి దారుణ హత్య.. భీతిగొలిపే వీడియో

Update: 2022-07-06 03:07 GMT
ఇటీవల ఉదయ్‌పూర్‌లో టైలర్‌ని దారుణంగా హత్య చేయడం యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆ హత్యకు ముందు ఆ వీడియోలు కలకలం రేపాయి. ఆ తర్వాత కెమెరాలో చిక్కుకున్న మరో భయంకరమైన హత్య ఇప్పుడు అందరినీ షాక్ కు గురిచేస్తోంది.

కర్ణాటకలోని వాస్తు నిపుణుడు చంద్రశేఖర్ గురూజీని హుబ్బలి జిల్లాలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో ఇద్దరు వ్యక్తులు పలుమార్లు కత్తితో పొడిచి పొడిచి చంపారు. భక్తులుగా నటిస్తున్న ఇద్దరు వ్యక్తులు రిసెప్షన్ ఏరియాలో అతని కోసం  వేచి ఉన్నారు.

తరువాత అతనిని కత్తితో పొడిచి చంపినట్లు సీసీటీవీ కెమెరాల ద్వారా వెలుగుచూసింది. ఈ  భయంకరమైన హత్య అందరినీ షాక్ కు గురిచేసింది. ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

ఇద్దరు వ్యక్తులు అతను కుర్చీలో కూర్చునే వరకు వేచి ఉన్నారు. వారిలో ఒకరు చంద్రశేఖర్ గురూజీ పాదాలను తాకడం ద్వారా అతని ఆశీర్వాదం పొందారు. మరొకరు తెల్లటి గుడ్డలో దాచిన కత్తితో అతనిని పొడవడం ప్రారంభించాడు.

చంద్రశేఖర్ గురూజీ తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నించాడు. నొప్పితో అరిచాడు. కానీ హంతకులు ఇద్దరూ అతని శరీరమంతా కత్తులతో పదేపదే పొడిచారు. చాలా మంది వీక్షకులు దాడిని చూస్తున్నారే కానీ ఆపే ప్రయత్నం మాత్రం చేయలేదు. కొంతమంది హోటల్ సిబ్బంది వారిని ఆపడానికి ప్రయత్నించారు. హంతకులు వారందరినీ కత్తులతో బెదిరించి అక్కడి నుంచి పారిపోయారు.

కాగా వాస్తు నిపుణుడితో వారికే సంబంధం.. ఈ హత్యకు అసలు ఏం కారణం అన్నది తెలియరాలేదు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.



Full ViewFull ViewFull ViewFull ViewFull ViewFull View
Tags:    

Similar News