ఊహించని ఉత్పాతం మీద పడినప్పుడు చోటు చేసుకునే పరిణామాలు ఎంత దారుణంగా.. బీభత్సంగా ఉంటాయన్నది గడిచిన కొద్దిరోజులుగా ప్రపంచం చూస్తూనే ఉంది. చరిత్రలో మళ్లీ ఇలాంటి పరిస్థితులు వస్తాయా? అన్న రీతిలో కరోనా కాలం ప్రపంచ ప్రజలకు పెను సవాళ్లను విసిరింది. ఇంతకాలం తనకు తిరుగులేదనుకునే మనిషికి మైండ్ బ్లాక్ అయ్యేలా చేసిన ఘనత కరోనాదే. కంటికి కనిపించనంత అతి సూక్ష్మ వైరస్ పుణ్యమా అని ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్ని కదిలిపోవటమే కాదు.. కొన్ని దేశాల్లో అయితే కుదేల్ అయిపోయాయి. ఇందుకు భారత స్టాక్ మార్కెట్ మినహాయింపేమీ కాదు. భారీ పతనాలు.. జీర్ణించుకోలేని రీతిలో బ్లూచిప్ షేర్ల ధరలు పడిపోయాయి. ఫలానా షేర్లు చేతిలో ఉంటే చాలు.. సుడి తిరిగి పోయినట్లే అన్నట్లు ఉండేవి కూడా చేతులు కాలిపోయేలా చేశాయి. అంతా నిరాశాపూరిత వాతావరణంలో సరికొత్త కాంతి రేఖ ఎలా ఉంటుందన్నది అర్థమయ్యేలా చేసింది మంగళవారం.
గడిచిన చేదు గతాన్ని వదిలేస్తే.. భవిష్యత్తు ఎలా ఉంటుందన్నది శాంపిల్ చూపించింది. కరోనాతో దెబ్బకు ఆగమాగమైన ఆర్థిక వ్యవస్థకు చిన్న అసరా దొరకాలే కానీ.. మార్కెట్ ఎంతలా చెలరేగిపోతుందన్న విషయాన్ని మంగళవారం మార్కెట్ చూపించింది. బీఎస్ఈ సెన్సెక్స్ ఒక్కరోజులో అత్యధికంగా 2476 పాయింట్ల భారీ లాభాన్ని నమోదు చేసింది. దీంతో.. మదుపర్ల సంపద ఒక్కరోజులోనే రూ.7.71లక్షల కోట్లకు పెరిగింది. దీంతో.. బీఎస్ఈలో లిస్ట్ అయిన కంపెనీల మార్కెట్ విలువ అమాంతం పెరిగింది. మంగళవారం మార్కెట్ చెలరేగిపోవటంతో దాని విలువ ఏకంగా రూ.1,16,38,099.98 కోట్లకు చేరింది.
ఎందుకిలా జరిగింది? తాజా పరిణామం భవిష్యత్తు గురించి ఏం చెబుతోంది? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతికితే పాత బాధ పోయి.. కొత్త హుషారు రావటం ఖాయం. అమెరికా.. ఇటలీ.. స్పెయిన్ దేశాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టొచ్చన్న ఆశలతో పాటు.. గణాంకాలు సైతం దానికి తగ్గట్లుగా ఉండటంతో మార్కెట్ సానుకూలంగా స్పందించింది. దీనికి ఊతమిచ్చేలా రెండో విడత ఉద్దీపన ప్యాకేజీ ప్రభుత్వం ప్రకటిస్తుందన్న వార్తలు మరింత హుషారును మార్కెట్ కు తీసుకొచ్చాయి. దీంతో.. షేర్ల ధరలు పెరిగాయి.
దీంతో.. రానున్న రోజులు మరెంత గడ్డుగా ఉంటాయన్న భావనను చెదిరేలా చేయటమే కాదు.. కొత్త ఆశల్ని నింపేలా చేసిందని చెప్పాలి. ఒక్కసారి పరిస్థితులు చక్కదిద్దుకోవాలే కానీ.. మార్కెట్ శివాలెత్తినట్లుగా చెలరేగిపోవటం ఖాయమన్న వాదనకు బలం చేకూరేలా మంగళవారం మార్కెట్ పరిణామాలు స్పష్టం చేశాయని చెప్పాలి. ఒక మహా పతనం తర్వాత.. మార్కెట్లు పుంజుకోవటం.. కొత్త ఉత్సాహంతో దూసుకెళ్లటం మామూలే. అయితే.. ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకునే పరిణామాలు సెంటిమెంట్ మీద ప్రభావాన్ని చూపిస్తాయని చెప్పాలి. కరోనా కేసులు తగ్గటం మొదలు పెడితే మాత్రం స్టాక్ మార్కెట్ దూసుకెళ్లటం ఖాయమన్న సంకేతాల్ని మంగళవారం స్పష్టం చేసినట్లే.