తన వీడియో మెసేజ్ తో దేశం మొత్తాన్ని కదిలించటమే కాదు.. మోడీ సర్కారుపై విపరీతమైన ఒత్తిడిని తెచ్చేలా చేసిన సైనికుడి ఉదంతం గుర్తుందా? ఆయనిప్పుడు ఎక్కడ? ఏం చేస్తున్నారు? వీడియో విడుదల చేసిన తర్వాత ఆయనమళ్లీ కనిపించలేదు. ఆయనిప్పుడు ఎక్కడున్నాడు? మోడీ లాంటి నేత ప్రధానిగా ఉన్న దేశంలో.. సైనికులకు జరుగుతున్న అన్యాయం గురించి ధైర్యంగా చెప్పటమే కాదు.. వ్యవస్థలోని లోపాల్ని కళ్లకు కట్టినట్లుగా చూపించిన ఆయనకు సత్కారం లభిస్తుందని.. ప్రధాని ఆయన్ను ప్రశంసిస్తారని కొందరు అనుకున్నారు.
కానీ.. ఆయన పరిస్థితి దారుణంగా ఉందన్న చేదు వాస్తవం బయటకు వచ్చింది. సరిహద్దుల్లో బాధ్యతలు నిర్వర్తించే జవాన్లకు చెత్త ఫుడ్ పెడుతున్నారని చెప్పటమే కాదు.. ఎంత దారుణమైన ఫుడ్ పెడుతున్నారో చూడాలంటూ వీడియో పోస్ట్ చేసిన తేజ్ బహదూర్ యాదవ్ ను ఆర్మీ వర్గాలు హింసలకు గురి చేస్తున్నారట. తాను చెబుతున్న వాస్తవాల నేపథ్యంలో తన భవిష్యత్తు ఎలా ఉంటుందోనన్న సందేహాలు వ్యక్తం చేసిన దానికి తగ్గట్లే.. తేజ్ బహదూర్ పరిస్థితి దారుణంగా మారిందని ఆయన భార్య షర్మిల యాదవ్ ఆరోపిస్తోంది.
తన భర్తను అధికారులు అరెస్ట్ చేసి.. చిత్ర హింసలకు గురి చేస్తున్నారని.. ఆ విషయాన్ని భర్తే తనకు ఫోన్ చేసినట్లు చెప్పినట్లుగా చెబుతున్నారు. గుర్తు తెలియని నెంబరు నుంచి ఫోన్ చేసిన తన భర్త.. ఇప్పటికే తమ వద్దకు రావాల్సి ఉందని.. కానీ.. రాలేదని ఆరోపిస్తున్నారు. అయితే.. అధికారులు మాత్రం ఈ వాదనల్ని ఖండిస్తున్నారు. తేజ్ బహుదూర్ ను అరెస్ట్ చేయలేదని.. క్రమశిక్షణ చర్యలు మాత్రమే తీసుకున్నట్లు చెబుతున్నారు. వ్యవస్థలోని లోపాల్ని ఎత్తి చూపిస్తే.. క్రమశిక్షణారాహిత్యమే అవుతుంది మరీ. తేజ్ బహదూర్ లాంటి సీదాసాదా జవాను జరుగుతున్న అన్యాయాల్ని నోరు మూసుకొని చూస్తుండాలే కానీ.. బహిరంగంగా బయటకు చెప్పకూడదు కదా.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/