ప్రత్యేక హోదా ఇస్తారో ఇవ్వరో అన్నది తేలకున్నా.. బీజేపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం మాత్రం షురూ అయ్యింది. ఇరు పార్టీల నాయకుల మధ్య భవిష్యత్తులో ఢీ అంటే ఢీ అనే స్థాయిలో వార్ జరగనుందని ఓ క్లీయర్ పిక్చర్ వచ్చింది. ఇప్పటికే చంద్రబాబు కేంద్రంతో ఢీ అంటే ఢీ అనేందుకు రెఢీ అవుతుండగా... ఆయన బాటలోనే ఎమ్మెల్యే లు, ఎంపీలు సైతం నడవనున్నారు.
కేంద్ర మంత్రి జైట్లీ వంటి పెద్దలతో నిన్నటి వేళ కఠువుగా మాట్లాడిన బాబు, ఇక తన జోరును ఎట్టి పరిస్థితుల్లో తగ్గించరాదని నిర్ణయించుకున్నారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సైతం వాదానికి.. వాగ్వాదానికి సై అంటున్నారు. ప్రధాని మోడీ కన్నాఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే గొప్ప అని వ్యాఖ్యానిస్తూ.. తన మనసులో మాట చెప్పేశారు.
రాష్ట్ర ప్రగతి కోసం విశేష కృషి చేస్తున్న చంద్రబాబు ప్రతిష్టకు దెబ్బ తగిలే విదంగా బీజేపీ వ్యవహరిస్తే టీడీపీ కార్యకర్తలు సహించజాలరని స్పష్టం చేశారు.బీజేపీ వల్ల చంద్రబాబుకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయని అన్నారు. నటుడు శివాజీని అడ్డు పెట్టుకుని కాంగ్రెస్, సీపీఐలు డ్రామా ఆడుతున్నాయని ఆరోపించారు. ఉన్నట్టుండి రాజుకున్న ఈ వివాదం ఇప్పట్లో పొలిమేరలు దాటేలా లేదు. హోదా పుణ్యమాని పాపం మిత్రపక్షాలైన బీజేపీ - టీడీపీ ఒకదానినొకటి విమర్శించుకుంటూ.. విపక్షాలకు మంచి ఛాన్స్ ఇస్తున్నాయి.