తెలుగు రాష్ట్రాల్లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. తెలంగాణలో మార్చి 15 నుంచి సమావేశాలు మొదలు కానుండగా.. ఏపీలో 19 నుంచి షురూ కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వాలు ప్రకటించాయి.
తెలంగాణలో 15వ తేదీ ఉదయం 11 గంటలకు గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు మొదలవుతాయి. 16న దివంగత ప్రజాప్రతినిధుల మృతిపట్ల సంతాప తీర్మానం ప్రవేశపెడతారు. 17న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతారు. 18వ తేదీన 11.30 గంటలకు బడ్జెట్ 2021-22 ను ప్రవేశ పెడతారు.
ఏపీలో మార్చి 19న ఉదయం గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. ఏపీలో తొలిసారిగా జెండర్ బడ్జెట్ ను ప్రత్యేకంగా ప్రవేశపెడతామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ సమావేశంలో పలు కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టేందుకు సర్కారు సిద్ధమవుతోంది. పార్టీలన్నీ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి.