కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగలబోతోంది. ఇప్పటికే 9మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు షాకిచ్చి టీఆర్ ఎస్ లో చేరిన సంగతి తెలిసిందే.. తాజాగా ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ కాంగ్రెస్ కు రాజీనామా చేసి టీఆర్ ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకోవడం కాంగ్రెస్ ను ఆందోళనకు గురిచేస్తోంది.
ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా చాలా కాలం పనిచేసి పార్టీకి సేవలందించిన భిక్షమయ్య గౌడ్ తాజాగా కాంగ్రెస్ కు గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించారు. గతంలో ఆలేరు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన భిక్షమయ్య.. 2014,2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కొన్నాళ్ల నుంచి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వరకూ క్రియాశీలంగా వ్యవహరించారు. ఇప్పుడు సడన్ గా ఆ పార్టీకి దూరంగా జరగడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పెద్దలు ఎంత నచ్చజెప్పినా ఆయన పార్టీ మారడానికే సిద్ధమయ్యారు.
కాంగ్రెస్ ను వీడుతున్నట్లు ప్రకటించిన భిక్షమయ్య గౌడ్ ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేతలు కోమటిరెడ్డి బ్రదర్స్ పై సంచలన ఆరోపణలు చేశారు. తాను ఆలేరులో రెండు సార్లు ఓడిపోవడానికి కోమటిరెడ్డి సోదురులే కారణమని ఆరోపించారు. బీసీ సామాజికవర్గానికి చెందిన తనపై కొందరిని స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దింపి తన ఓటమికి కారణమయ్యారని ఆరోపించారు. భువనగిరి ఎంపీ టికెట్ ను మధుయాష్కీకి లేదా ఇతర బీసీ నేతలకు ఇద్దామని పెద్దల దృష్టికి తీసుకెల్లినా కోమటిరెడ్డి బ్రదర్స్ అడ్డుపడి టికెట్ తెచ్చుకున్నారని తెలిపారు.
కాంగ్రెస్ టికెట్ల కేటాయింపులో సామాజిక న్యాయం చేయలేదని.. అందుకే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవులుకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. సీఎం కేసీఆర్ పాలన నచ్చిందని..అందుకే తన అనుచరులతో కలిసి త్వరలోనే గులాబీ తీర్థం పుచ్చుకుంటానని తెలిపారు. మూడు రోజుల్లోనే కారెక్కుతున్నానని ప్రకటించారు.