ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - తెలుగుదేశం పార్టీ ప్రచారంలో ఆరితేరిపోయిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే - పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇటీవల పబ్లిక్ అకౌంట్స్ కమిటీ జరిపిన సమీక్షలో ఆశ్చర్యపోయే లెక్కలు వెలుగులోకి వచ్చాయని ఆయన తెలిపారు. గడిచిన నాలుగేళ్లలో టీడీపీ ప్రభుత్వం చేసిన అప్పులు దాదాపుగా రూ 1.20 లక్షల కోట్లు అని తేలిందని - ఇన్ని లక్షల కోట్లు ఖర్చు చేసినా రాష్ట్రంలో చెప్పుకోదగ్గ ప్రాజెక్టు ఒక్కటీ పూర్తవలేదని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. పట్టిసీమ - తాత్కాలిక సచివాలయం మినహా రాష్ట్రంలో చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు ఏవో ప్రభుత్వం చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
పీఏసీలో తాము గమనించిన విషయాలను బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీడియాకు వివరించారు. నాలుగేళ్లలో 1.20 లక్షల కోట్లు టీడీపీ ప్రభుత్వం ఏం చేసిందనే విషయంపై ఆర్థిక వేత్తలు విస్తుపోతున్నారని రాజేంద్రనాధ్ రెడ్డి చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రూ.1600 కోట్లు ఖర్చుపెట్టి పూర్తి చేసిన పట్టిసీమ ప్రాజెక్టు ఎత్తేస్తారని - అలాగే శాశ్వత ప్రభుత్వ కార్యాలయాలు పూర్తయితే రూ.700 కోట్లతో నిర్మించిన తాత్కాలిక సెక్రటేరియట్ ఎత్తేస్తారని - ఇవన్నీ తెలిసికూడా కనీస ఆలోచన లేకుండా వందల కోట్లు ఖర్చు చేశారని విమర్శించారు. జీవో నంబరు 22తో ప్రాజెక్టుల అంచనాలు పెంచిందని ఈపీసీ విధానంలో ప్రాజెక్టు కేటాయించేటప్పుడే అంచనాలుంటాయని - అటువంటప్పుడు వందల కోట్లు అదనంగా ఎలా కేటాయించారని ఆయన సూటిగా ప్రశ్నించారు.
ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాకుండానే రాష్ట్రంలో రెవెన్యూ లోటు పెంచారని బుగ్గన వివరించారు. 2014లో రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చేప్పటికి రూ. 97 వేల కోట్ల అప్పులుండగా...2014 నుండి ఇప్పటి వరకూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మరో రూ.1.20 లక్షల కోట్లు అప్పు చేశారని బుగ్గన వివరించారు. `ఇందులో రూ.68 వేల కోట్లు వడ్డీతో కూడినవి, మిగిలినవి వడ్డీలేనివి. వీటిని కూడా వేర్వేరు ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ బ్యాంకుల నుండి తీసుకొచ్చారు. దీంతో మొత్తం మీద ఇప్పటికే ఏపీ అప్పులు రూ.2.16 లక్షల కోట్లు చేరాయి.అప్పులు కాకుండా రూ.70 వేల కోట్లు రెవెన్యూ లోటు చూపిస్తుండటం కూడా అనుమానాలకు తావిస్తోందన్నారు. రాష్ట్ర విభజన సమయానికి కాగ్ నివేదికలో రూ.7000 కోట్ల లోటు ఉంటుందని చెప్పిందని, కేంద్రమైతే రూ.4000 కోట్లు మాత్రమే ఉంటుందని చెప్పిదని, అందుకే కేంద్రం ఆ మేరకు నిధులు విడుదల చేసి చేతులు దులుపుకొందని నిపుణులు చెబుతున్నారు.` అంటూ సంచలన విషయాలు వెల్లడించారు.
పీఏసీలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వడ్డీలేని అప్పులు తీసుకొచ్చామని, వీటి వల్ల ఇబ్బంది ఏమిటని ప్రభుత్వ ప్రతినిధులు ఎదురు ప్రశ్నిస్తున్నారని బుగ్గన మండిపడ్డారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిరర్దక ఖర్చు పెడుతోందని బుగ్గన ఆరోపించారు. రాష్ట్రంలో ఆదాయాన్ని తెచ్చే పనులు చేయకుండా పనుల పేరుతో నిధులు మాత్రం ఖర్చు చేశారని ఆయన మండిపడ్డారు. పోలవరానికి ఖర్చు చేసినా వాటిని కేంద్రం నుండి రీయింబర్స్ చేసుకుంటున్నారని, అటువంటప్పుడు అది అప్పులో లెక్క కూడా కాదని..తెచ్చిన అప్పులు ఏమయ్యాయనే సందేహం అందరిలో నెలకొందన్నారు. ప్రజల నెత్తిన అప్పుల భారం మోపటం సరైంది కాదని, ఇకనుంచి ప్రచారం పక్కనపెట్టి ప్రజోపయోగ పనులు చేయాలని బుగ్గన సూచించారు.