ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రోజూ ఏదో ఒక అంశంపై అధికార - విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. అదే ఊపులో బుధవారం జరిగిన సమావేశాల్లో భాగంగా విపక్ష నేత - టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిపై ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ రెడ్డి తనదైన శైలి సెటైర్లు సంధించారు. చంద్రబాబు హయాంలో జరిగిన బడ్జెట్ కేటాయింపులు - నిధుల వ్యయాలను బయటకు తీసిన బుగ్గన... అవినీతికి ఆస్కారం ఉన్న పథకాలకు కేటాయింపుల కంటే ఎక్కువ నిధులు కేటాయించారని - అదే సంక్షేమ రంగానికి వస్తే కేటాయింపులు ఘనంగా ఉన్న వ్యయం మాత్రం చాలా తక్కువగా ఉందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు పాలన అంతా మేటర్ వీక్ - ప్రచారం పీక్స్ అన్న చందంగా సాగిందని వ్యాఖ్యానించిన బుగ్గన... మ్యాటర్ లేదని భావించే టీడీపీకి ప్రజలు ఓటు వేయలేదని చెప్పారు. వెరసి బుగ్గన సంధించిన సెటైర్లతో టీడీపీ శిబిరం బాగానే ఇబ్బంది పడినట్టుగా కనిపించింది.
2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ రెడ్డి ఇదివరకే ప్రవేశపెట్టగా... దానిపై నాలుగు రోజుల పాటు చర్చ జరిగింది. ఆ చర్చలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు సిద్ధమైన బుగ్గన... ఆయా పథకాలకు టీడీపీ హయాంలో ఏ మేర కేటాయింపులు జరిగాయి? వాటిలో ఎంత మేర నిధులు విడుదలయ్యాయి? వాటిలో ఎంత మేర నిధులను ఖర్చు చేశారన్న విషయాలను అంకెలతో సహా చెప్పడంతో పాటుగా తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ లో ఏఏ రంగాలకు ఎంతమేర కేటాయింపులు చేశామన్న విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగానే ఆయా పథకాలకు తాము ఇచ్చిన ప్రాధాన్యం - చంద్రబాబు హయాంలో దక్కిన ప్రాధమ్యాలను బుగ్గన సెటైరికల్ గా వివరిస్తూ సాగారు.
ఈ సందర్భంగానే చంద్రబాబు హయాం అంతా మేటర్ వీక్ - పబ్లిసిటీ పీక్స్ అన్న చందంగా సాగిందని బుగ్గన ఎద్దేవా చేశారు. నీరు- చెట్టు పథకానికి వందల కోట్లలో కేటాయింపులు చేసి వేల కోట్ల మేర నిధులను వెచ్చించిన బాబు సర్కారు... అదే సంక్షేమ రంగానికి వస్తే... కేటాయించిన నిధుల కంటే వ్యయం చేసిన నిధులు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పారు. ఇక రాజధాని అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబు సర్కారు కేవలం రూ.277 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని బుగ్గన చెప్పారు. ఆ నిధులను కూడా దుర్వినియోగం చేసి నాసిరకం పనులు చేశారని ఆక్షేపించారు. ఇక రాజధాని డిజైన్ల కోసం నాటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడిని వెంటేసుకుని పలు దేశాలు తిరిగిన చంద్రబాబు... చివరకు డిజైన్ల బాధ్యతను బాహుబలి డైరెక్టర్ రాజమౌళికి అప్పగించారని ఎద్దేవవా చేశారు. అయితే రాజధాని అమరావతిపై తమకు చిత్తశుద్ది ఉందని, అందుకే తొలి బడ్జెట్ లోనే రూ.500 కోట్లను కేటాయించామని చెప్పారు. బాబు హయాంలో ఐదేళ్లలో రూ.277 కోట్లు ఖర్చు చేస్తే... తాము తొలి ఏడాదిలోనే రూ.500 కోట్లు కేటాయించామని చెప్పిన బుగ్గన... రాజధానిపై ఎవరికి నిజమైన చిత్త శుద్ధి ఉందో ప్రజలు తెలుసన్నారు.
ఇక దోమలపై దండయాత్ర పేరిట బాబు హయాంలో జరిగిన ప్రచారంపై బుగ్గన సంధించిన సెటైర్లు బాబు బ్యాచ్ ను బాగానే ఇబ్బంది పెట్టాయి. దోమలపై దండయాత్రలో భాగంగా కర్నూలు నగరంలోని ఫైవ్ రోడ్ జంక్షన్ లో బాహుబలి అవతారంలో చంద్రబాబును, ఆయన చేతిలో ఓ కత్తిని, ఆ కత్తి మొన వద్ద అదే కత్తి వేటుకు చనిపోతున్న ఓ చిన్న దోమను పెట్టారని బుగ్గన చెప్పారు. అయితే దానిని చూసిన తాను... సీఎం హోదాలో ఉన్న చంద్రబాబును దోమలను చంపుతున్నట్లుగా అది కూడా బాహుబలి అవతారంలో బాగోలేదని కలెక్టర్ కు చీవాట్లు పెట్టి మరీ తీయించానని చెప్పడంతో సభలో నవ్వులు విరిశాయి. మొత్తంగా టీడీపీ హయాంలో జరిగిన అవినీతి, ఆయా శాఖలకు నిధుల కేటాయింపులపై తనదైన శైలి సెటైర్లు సంధించిన బుగ్గన బాబు అండ్ కోకు నోట మాట రాకుండా చేశారని చెప్పక తప్పదు.