ఎద్దు ధర రూ. 1 కోటి.. ప్రత్యేకత ఏమిటో తెలుసా?

Update: 2021-11-16 04:54 GMT
ఎద్దు ధర ఏంటి...కోటి ఏంటి మీకేమైనా పిచ్చా అని అనుకుంటున్నారా ? ఎద్దు విలువ ఎంతుంటుంది చెప్పండి. మా అంటే 50 వేలు, లేదంటే ల‌క్ష వేసుకోండి. అంత‌కుమించి ఎక్కువైతే ఉండ‌దు. ఒక‌వేళ ఒంగోలు జాతి గిత్త‌లు అయితే కొంచెం ఎక్కువ ధ‌ర ప‌లుకుతుందేమో , ఎందుకంటే ఒంగోలు గిత్తల గురించి మనకు బాగా తెలుసు. ఆకారంలో, బలంలో దిట్టంగా ఉండే ఆ ఎద్దుల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతాయి. కానీ మరీ కోటి అంటే బాగా ఎక్కువ కదా అనుకోకండి. కానీ.. ఈ ఎద్దు విలువ  కోటి. అక్ష‌రాలా కోటి రూపాయ‌లు.  

మీరు ఆశ్చ‌ర్య‌పోయినా..ఆశ్చర్యపోకున్నా..దాని విలువ కోటి రూపాయ‌లే. ఎందుకు దానికి అంత విలువ‌. అయినా, దాన్ని అంత డ‌బ్బు పెట్టి ఎవ‌రు కొంటారు అంటారా, అయితే దాని స‌త్తా ఏంటో మీరు తెలుసుకోవాల్సిందే. ఆ ఎద్దు హ‌ల్లిక‌ర్ జాతికి చెందిన‌ది. దాని పేరు కృష్ణ‌. బెంగ‌ళూరులో ఇటీవ‌ల జ‌రిగిన కృషి మేళాలో అదే స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచింది. దాని ఓన‌ర్ బోరెగౌడ ఏమంటాడంటే  ఆ ఎద్దు అన్ని జాతుల్లో మేలైన జాతి అని, ఈ జాతి ఎద్దులు చాలా అరుదుగా ఉంటాయ‌ని తెలిపాడు.ఈ జాతి ఎద్దు అరుదు కాబ‌ట్టి.. దాని వీర్యానికి చాలా డిమాండ్ ఉంటుంది. వీర్యం ఒక్క డోస్‌ కు వెయ్యి రూపాయ‌లు తీసుకొని అమ్ముతాం, అంటూ చెప్పుకొచ్చాడు.

ఈసారి కృష్ణ‌మేళాలో 12000 మంది రైతులు రిజిస్ట‌ర్ చేసుకున్నారు. ఈ మేళ‌లో వ్య‌వ‌సాయంలో లాభాలు గ‌డించ‌డం కోసం రైతులు ఎటువంటి పంట‌లు వేయాలి. ఎటువంటి ఎరువులు వాడాలి. హైబ్రిడ్ క్రాప్స్‌ లో ఉన్న ర‌కాల గురించి వ్య‌వ‌సాయ నిపుణులు రైతుల‌కు వివ‌రించారు. ఈ యేడాది నిర్వహించిన కృషి మేళాకు 12,000 మంది రైతులు రిజిస్టర్ చేసుకున్నారు. 550 వ్యవసాయ స్టాల్స్‌లో సంప్రదాయ, హైబ్రిడ్‌కు చెందిన వ్యవసాయ ఉత్పత్తులు, వ్యవసాయ సాంకేతిక పరికరాలు, పశువులు, పౌల్ట్రీ ఉత్పత్తులను ఈ మేళాలో ఏర్పాటు చేశారు.
Tags:    

Similar News