తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసి దుమారం రేపారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయని వారిని తరిమి కొడుతామని రాజాసింగ్ హెచ్చరికలు పంపడం సంచలనమైంది. యూపీ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ కు ఓట్లు వేయని వారిని గుర్తిస్తామని రాజాసింగ్ తెలిపారు.
ఇప్పటికే యోగి ఆదిత్యనాథ్ వందల సంఖ్యలో బుల్ డోజర్లు, జేసీబీలకు ఆర్డర్ ఇచ్చారని.. వాటిని తెప్పిస్తున్నారని చెప్పారు. బుల్ డోజర్లు, జేసీబీలను ఎందుకు తెప్పిస్తున్నారో తెలుసా? యోగికి ఓటు వేయని వారిని గుర్తించి వారి ఇళ్లపైకి వందల సంఖ్యలో వాటిని పంపిస్తామని రాజాసింగ్ హెచ్చరించారు.
యోగి ఆదిత్యనాథ్ కు ఓటు వేయాల్సిందేనని.. ఆయనకు ఓటు వేయని ద్రోహులకు ఉత్తరప్రదేశ్ లో స్థానం లేదని స్పష్టం చేశారు.యోగికి ఓటు వేయని వారిని తరిమి కొడుతామని హెచ్చరించారు. ఇప్పటికే యోగి ఆదిత్యనాథ్ ఈ మేరకు రంగం సిద్ధం చేశారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
యోగి ఆదిత్యనాథ్ ను ఇష్టపడని ప్రాంతాల్లో భారీగా పోలింగ్ నమోదైందని రాజాసింగ్ గుర్తు చేశారు.యోగిని ముఖ్యమంత్రిగా అంగీకరించని వారు ఇళ్లలో నుంచి బయటకు వచ్చి తమ ఓటుహక్కును వినియోగించుకున్నారని.. ఈ పరిస్థితిని అడ్డుకోవడానికి హిందూ బంధువులందరూ మిగిలిన ఐదు దశల్లో పెద్దఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని రాజాసింగ్ పిలుపునిచ్చారు. భారీగా ఓట్లు వేయాలని సూచించారు.
మూడో దశ పోలింగ్ లో హిందువులందరూ పోలింగ్ కేంద్రాలకు పోటెత్తాలని రాజాసింగ్ పిలుపునిచ్చారు. యోగికి ఓటు వేయని వారిని ఎన్నికలు ముగిశాక గుర్తించి తరిమికొడుతామని హెచ్చరించారు.దీని కోసం బుల్ డోజర్లు, జేసీబీలను యోగి తెప్పిస్తున్నారని.. అవి బయలు దేరాయని రాజాసింగ్ స్పష్టం చేశారు. బీజేపీ నేత్లో ఈ అసహనానికి కారణం తొలి రెండు దశల్లో పోలింగ్ ట్రెండ్ అని తెలిపారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉందనే సంకేతాలను పంపించినట్టైందని అంటున్నారు.