పేదలకు ఇళ్ళ స్ధలాలు కేటాయిస్తున్నపుడు అన్నీ విధాలుగా నివాసయోగ్యంగా ఉండేట్లు చూడాలి. అంతేకానీ వర్షంవస్తే ముంపుకు గురయ్యే ప్రాంతంలో ఇళ్ళస్ధలాలు ఇచ్చేశామని చేతులు దులిపేసుకుంటే లబ్దిదారులు ఒప్పుకుంటారా ? ఇపుడిదే ప్రశ్న తూర్పుగోదావరి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో లబ్దిదారులు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో కోరుకొండ మండలంలోని బూరుగపూడి గ్రామం ప్రాంతంలో అధికారుల నిర్వాకంతో ప్రభుత్వంపై కోట్ల రూపాయల భారం పడబోతోంది.
ఇంతకీ విషయం ఏమిటంటే బూరుగపూడి గ్రామంలో అధికారులు సుమారు 586 ఎకరాలను కోట్ల రూపాయలు పెట్టి కొన్నారు. నిజానికి ఈ ప్రాంతంలో భూములు కొననే కొనకూడదు. ఎందుకంటే చిన్నపాటి వర్షంకురిసినా ఈ ప్రంతమంతా పెద్ద చెరువుగా మారిపోతుంది. ఎందుకంటే ఇవన్నీ అవభూములు. ఈ విషయం కొనుగోలు చేసిన అధికారులకు, భూమిని ఎంపికచేసిన నేతలకు అందరికీ తెలిసిందే. అయినా ఈ భూముల్లో ఇళ్ళు కట్టుకుని తాము ఉండబోయేది లేదు కాబట్టి ప్రభుత్వంతో కొనిపించేశారు.
భూములను కొన్నదగ్గర నుండి వర్షాలు పడుతున్నాయి అవి ముణిగిపోతున్నాయి. ఈ విషయాలను అందరు గమనిస్తునే ఉన్నారు. తాజాగా పై 586 ఎకరాలను ప్లాట్లుగా వేసి వేలాదిమందికి పంపిణీ చేశారు. లబ్దిదారులు ఇళ్ళు కట్టుకుందామని అనుకుంటున్న సమయంలోనే వర్షాలు మొదలయ్యాయి. వర్షాలు వెలసిన తర్వాత లబ్దిదారులు తమ స్ధలాల దగ్గరకు వెళ్ళిచూడగా పెద్ద చెరువు కనబడింది. దాంతో లబ్దిదారులంతా అయోమయానికి గురయ్యారు.
అధికారులు+నేతలు కలిసి పంపిణీ చేసిన బూరుగపూడి గ్రామంలోని ఆవభూములకు రెండువైపులా పెద్ద చెరువులున్నాయి. వర్షాలకు అవినిండిపోతే అందులోని నీరంతా ఇపుడు పట్టాలు పంచిన స్ధలంలోకే వచ్చేస్తాయని అందరికీ తెలుసు. తెలిసే ఆ భూమిని ప్రభుత్వంతో కొనుగోలు చేయించి పేదలకు పట్టాల రూపంలో పంచారు. ఇక్కడే పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని తెలుగుదేశంపార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.
విచిత్రమేమిటంటే ఆవభూముల్లోని నీటిని తోడేయటానికి ఎత్తిపోతల పథకం నిర్మించాలని అధికారులు ప్రతిపాదనలు చేశారట. అసలిక్కడ పట్టాలు పంచటం ఎందుకు ? ఆ నీటిని తోడేయటానికి ఎత్తిపోతల పథకం నిర్మించాలని చెప్పటమెందుకు ? అంటే ఎత్తిపోతల పథకం నిర్మాణంలో కూడా ప్రజాధనం భోంచేసే పథకం రూపొందించినట్లు అర్దమైపోతోంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కల్పించుకుని విచారణ చేయిస్తే కానీ పేదలకు న్యాయం జరగదు.