పిచ్చ పీక్స్.. త‌మిళ కుర్రాళ్ల బ‌స్ డే ఎంత డేంజ‌రంటే?

Update: 2019-06-18 09:31 GMT
ఎంజాయ్ చేయాలి. అలా అని ప్రాణాల మీద‌కు తెచ్చుకోకూడ‌దు. త‌మ మీదే ఎన్నో ఆశ‌లు.. ఆకాంక్ష‌లు పెట్టుకున్న త‌ల్లిదండ్రుల గురించి ఆలోచించ‌కుండా ఎంత బాధ్య‌తారాహిత్యంతో వ్య‌వ‌హ‌రించే కుర్రాళ్ల తీరు చూస్తే ఒళ్లు మండ‌క మాన‌దు. సోష‌ల్ మీడియాలో.. వాట్సాప్ గ్రూపుల్లో వైర‌ల్ అవుతున్న ఈ వీడియో చూస్తే త‌మిళ కుర్రాళ్ల పిచ్చ ఎంత పీక్స్ కు చేరింతో కొట్టొచ్చిన‌ట్లుగా అర్థం కాక మాన‌దు.

పుట్టిన‌రోజు వేడుక‌ల పేరుతో ప్రాణాల మీద‌కు తెచ్చుకునే ఎన్నో ఉదంతాల‌కు త‌గ్గ‌ట్లే.. కొంత‌కాలం క్రితం నుంచి బ‌స్ డే పేరుతో పిచ్చ చేష్ట‌లు చేస్తున్నారు. క‌దులుతున్న బ‌స్సులో నుంచి బ‌స్సు మీద‌కు ఎక్కి.. ఒక్క‌సారిగా అక్క‌డ నుంచి కింద‌కు దూకేయ‌టం చేస్తుంటారు. దీన్ని బ‌స్సు డే పేరుతో వ్య‌వ‌హ‌రిస్తారు.

తాజాగా అలానే చేయ‌బోయిన కుర్రాళ్ల‌ను గుర్తించిన బ‌స్సు డ్రైవ‌ర్ ఒక్క‌సారిగా బ్రేక్ వేయ‌టంతో పెనుప్ర‌మాదం తృటిలో త‌ప్పింది. బ‌స్సులోని ప్ర‌యాణికులు ఎంత‌గా వారిస్తున్నా.. వారు పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. ఒక‌వేళ బ‌స్సు డ్రైవ‌ర్ కానీ అప్ర‌మ‌త్తంగా ఉండి ఉండ‌క‌పోతే ప‌దుల సంఖ్య‌లో ప్రాణాలు పోయేవ‌ని చెబుతున్నారు.

త‌మిళ‌నాడులో చేసే ఈ పిచ్చ క‌ల్చ‌ర్ ను అక్క‌డి ప్ర‌భుత్వం నిషేధించింది కూడా. కానీ.. కొంత‌మంతి తింగ‌రి కుర్రాళ్లు పైత్యంతో ఈ త‌ర‌హా అప్పుడ‌ప్ప‌డుఉ ప‌నులు చేస్తుంటారు. తాజాగా వైర‌ల్ అయిన ఈ వీడియోలో చూస్తే.. ఇదెంత ప్ర‌మాద‌క‌ర‌మైనదో అర్థమ‌వుతుంది.

వైర‌ల్ అవుతున్న ఈ వీడియోలో ఉన్న కుర్రాళ్లు ప‌చ్చ‌య‌ప్ప కాలేజీ.. అంబేడ్క‌ర్ అర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీల‌కు చెందిన కుర్రాళ్లుగా గుర్తించారు. ఈ వీడియోలో కింద ప‌డిన కుర్రాళ్ల‌లో 18 మందికి గాయాల‌య్యాయి. వారిని ఆసుప‌త్రుల్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌లో పోలీసులు 20 మంది విద్యార్థుల్ని అదుపులో తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది.


Full View


Tags:    

Similar News