ఏపీలో రాజకీయాలు ఎంత ఘోరంగా తయారయ్యాయి. ఎవరికి వారు.. రాజకీయ ప్రయోజనాలు తప్పించి.. తప్పుల మీద పోరాటం.. వాటి గురించి చిత్తశుద్ధితో వ్యవహరించటం లాంటివి అస్సలు కనిపించటం లేదు. కాలేజీలో చదువుకునే విద్యార్థి అనుమానాస్పద రీతిలో మరణిస్తే.. అలాంటి మరణంపై సీరియస్ కావాల్సిన ప్రభుత్వం చేష్టలుడిగినట్లు ఉందే తప్పించి పెద్దగా స్పందించింది లేదు. నాగార్జున యూనివర్సిటీలో రితేశ్వరి అనే విద్యార్థిని ర్యాంగింగ్ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవటం తెలిసిందే.
ఈ ఘటనపై ఏపీ సర్కారు పెద్దగా స్పందించింది లేదు. అదే సమయంలో విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరిని దుమ్మెత్తిపోశారు. నిజానికి.. రితేశ్వరి విషయంలో బాబు సర్కారు సీరియస్ గా స్పందించకపోవటానికి నిర్లక్ష్యం తప్పించి మరే కారణం కనిపించదు.
ప్రభుత్వ అలసత్వాన్ని గుర్తించిన జగన్ బ్యాచ్.. రితేశ్వరి అంశంపై చెలరేగిపోయింది. పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. నిజానికి రితేశ్వరి విషయంలో చంద్రబాబు సర్కారు చురుగ్గా వ్యవహరించి.. ఆమె మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా వ్యవహరించి ఉంటే బాగుండేది. కానీ.. బాబు సర్కారు మాత్రం ఈ విషయంలో మొద్దు నిద్ర పోయిందే తప్పించి స్పందించింది పెద్దగా లేదు. చివర్లో కాస్త హడావుడి చేసినా.. అదంతా కూడా కంటితుడుపు చర్యలు మాత్రమే.
ఇదిలా ఉంటే.. ఇప్పుడు ప్రకాశం జిల్లా చీమకుర్తిలోకి బీవీఎస్ ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో అనూష అనే విద్యార్థిని సీనియర్ల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ వ్యవహారంపై వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు పెద్దగా పట్టించుకున్నది లేదు. అలా అని అధికారపక్షం కూడా పెద్దగా పట్టనట్లే వ్యవహరించింది. ఎందుకిలా అంటే.. సదరు అనూష చదివే కాలేజీ.. జగన్ బ్యాచ్ కి చెందిన నేతది కావటమే కారణంగా చెబుతున్నారు.
రితేశ్వరి మృతి విషయంలో తీవ్రంగా స్పందించిన వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు.. తాజాగా అనూష మృతి విషయంలో పెద్దగా పట్టనట్లుగా వ్యవహరించటం గమనార్హం. దీనిపై తెలుగు తమ్ముళ్లు రియాక్ట్ అవుతూ.. రితేశ్వరి విషయంలో ఏపీలోని వివిధ ప్రాంతాల్లో ఉద్యమాలు చేసిన జగన్ బ్యాచ్.. అనూష విషయంలో ఎందుకలా చేయటం లేదని ప్రశ్నిస్తున్నారు. విద్యార్థిని మరణానికి కారణమైన కళాశాల ఛైర్మన్ అరెస్ట్ పై వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యల్ని తెలుగు తమ్ముళ్లు తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు.
పార్టీల్ని పక్కన పెడితే.. ఒక విద్యార్థిని అన్యాయమైన కారణంగా చనిపోతే.. అధికారపార్టీ తీవ్రంగా స్పందించాల్సి ఉంది. కానీ.. ఆ పని చేయకపోవటం విపక్షానికి అవకాశం ఇచ్చినట్లు అయ్యింది. తన రాజకీయ ప్రయోజనానికి తప్పించి మరింకేమీ తనకు పట్టదన్నట్లుగా జగన్ బ్యాచ్ వ్యవహరించటం దురదృష్టకరం. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారపక్షానికి తోడు.. విపక్షం కూడా వ్యవహరించటం ఏపీ ప్రజలు చేసుకున్న దురదృష్టకరంగా చెప్పాలి. రితేశ్వరి విషయంలో స్పందించిన జగన్ బ్యాచ్.. అనూష మృతి మీద స్పందించి ఉంటే బాగుండేది. అయిన వారిని కాపాడుకోవాలన్న తాపత్రయం తప్పించి.. ఒక అన్యాయానికి బలైన బాధితుల మీద కానీ.. వారి కుటుంబాల పట్ల ఏపీ అధికార.. విపక్షాలకు ఎలాంటి తాపత్రయం లేదని తాజా ఘటనతో తేలిపోయింది.