ఆ మధ్యన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా కర్నూలు జిల్లా నాయకుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి మరోసారి తీవ్రంగా విరుచుకుపడ్డారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన సందర్భంగా ఆర్డీఎస్ ప్రాజెక్టు గురించి ప్రస్తావించి.. తాను కుర్చీ వేసుకొని కూర్చొని మరీ ప్రాజెక్టు కట్టిస్తానని వ్యాఖ్యానించటం.. అవసరమైతే సీమాంధ్రుల మూతి మీద తన్ని మరీ ప్రాజెక్టు పూర్తి చేస్తానని చెప్పటం తెలిసిందే.
దీనిపై అప్పట్లోనే బైరెడ్డి ఆచితూచి స్పందించారు. అయితే.. కర్ణాటక.. తెలంగాణ రాష్ట్రాల జలదోపిడీ గురించి ప్రస్తావిస్తూ.. ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బైరెడ్డి కాస్తంత ఆవేశంగా ప్రసంగించారు.
అవసరమైతే బాంబులేస్తామంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ.. ఆయన వేసేవన్నీ గ్యాస్ బాంబులేనంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. పౌరుషాల పురిటిగడ్డ రాయలసీమలో కేసీఆర్ ఎత్తులు చెల్లవని వ్యాఖ్యానించారు. మూతి మీద తన్ని మరీ అనుకున్నది సాధించుకుంటామని కేసీఆర్ వ్యాఖ్యను ప్రస్తావిస్తూ.. ఆయన మూతి మీద తంతే.. మేం మరో చోట తంతాం అని తీవ్రంగా విరుచుకుపడ్డారు. మొత్తానికి ఒకరికి మించి మరొకరుగా పేలుతున్న మాటల తూటాలు చివరకు ఎక్కడి వరకు వెళతాయో..?