చేయాల్సిందంతా చేసేసి.. ఇప్పుడు మాట్లాడుతున్న సీమాంధ్ర కాంగ్రెస్ నేతల్ని చూస్తే.. సగటు సీమాంధ్రుడి కడుపు మండిపోతోంది. రాష్ట్ర విభజన సమయంలో నోట్లో నుంచి ఒక్క మాటంటే.. ఒక్క మాట కూడా రాకుండా చూస్తూ ఉండిపోయిన వారు ఇప్పుడు మాత్రం చాలానే మాటలు మాట్లాడుతున్నారు.
ప్రత్యేకహోదా ఇస్తామని నాటి యూపీఏ సర్కారు చెబితే.. మాటలు కాదమ్మా.. చట్టంలో చేర్చండని చెప్పే దమ్ము ధైర్యం లేని నేతలు.. ఇప్పుడు మాత్రం ప్రత్యేకహోదా కోసం నిరసనలు చేపడుతున్నారు. నేతలకు సిగ్గు లేకున్నా.. వారి పరివారానికి కూడా లేదన్నట్లు వ్యవహారం ఉంది. ఎందుకంటే.. వారు సైతం తమ నేతలు చెప్పిన మాటల్నే వల్లె వేస్తున్నారే తప్ప..''అన్నా ఎట్లా మాట్లాడతావ్? ఆ రోజు మాట్లాడింది లేదు.. ఈ ప్రత్యేకహోదా గురించి పోరాటం ఎలా చేస్తాం'' అని అడిగింది లేకున్నా.. రోడ్ల మీదకు వచ్చేస్తున్నారు.
తాజాగా సీమాంధ్ర కాంగ్రెస్ నేత రామచంద్రయ్య కూడా ఇలాంటి మాటలే మాట్లాడుతున్నారు. కాస్త విషయం మీద అవగాహన.. విభజన వల్ల జరిగిన నష్టం గురించి బాగానే అవగాహన ఉన్న రామచంద్రయ్య కూడా ఏపీ సర్కారు మీద పడిపోతున్నారు. వేల కోట్ల రూపాయిలు ఖర్చు చేసి రాజధాని నిర్మిస్తామని చెప్పటం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు.
ఉమ్మడి రాజధాని ఉన్న సమయంలో ఇప్పుడు ఇంత హడావుడి ఎందుని ప్రశ్నిస్తున్నారు. అద్దె లేకుండా ఉంటే మాత్రం సొంతిల్లు కట్టుకోమా? కోపం వచ్చిన ప్రతిసారీ ఉంటే ఉండండి.. పోతే పోండంటూ తెలంగాణ అధికారపక్షం చేస్తున్న వ్యాఖ్యలు రామచంద్రయ్యకు వినిపిస్తున్నట్లు లేవే.