సంబరాలు స్టార్ట్...ఫ్లెక్సీలు కట్టేస్తున్నారు...?

Update: 2022-04-10 09:30 GMT
ముందే తెలిసిపోయిందా. లేక వారికి కీలకమైన  భోగట్టా చెవిన పడిపోయిందా అంటే ఏదైనా కావచ్చు కానీ అపుడే కాబోయే మంత్రుల ఇళ్ళ దగ్గర, వారి ఆఫీసుల వద్ద క్యాడర్  ఫ్లెక్సీలు కట్టేస్తున్నారు. సంబరాలు పెద్ద ఎత్తున  స్టార్ట్ అయిపోయాయి. నిజానికి కొత్త మంత్రి వర్గంలో ఎవరికి చోటు అన్నది అఫీషీయల్ గా బయటకు రాలేదు. కానీ కాబోయే మంత్రులు వీరే అని మీడియాలో తెగ హోరెత్తిపోతోంది.

అన్ని వార్తలలో కామన్ గా కనిపించే కొన్ని పేర్లను చూసే వారికి కన్ ఫర్మ్ అని చెప్పేసుకుంటున్నారు. ఇంకేముంది. అభిమాన గణం అసలు ఊరుకోవడం లేదు. తమ చేతికి నోటికి పని చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే మాజీ మంత్రి సీనియర్ వైసీపీ  ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు పేరిట అపుడే   ఫ్లెక్సీలు కట్టేస్తున్నారు. మినిస్టర్ ప్రసాదరావు అని రాసి మరీ ఫ్యాన్స్ తమ ముచ్చట తీర్చుకుంటున్నారు.

నిజానికి ప్రసాదరావుని మంత్రిగా చూడాలని క్యాడర్ మూదేళ్ల ముంచి కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తోంది. ఇన్నాళ్ళకు ఆ అవకాశం వస్తోందని వారు భావిస్తున్నారు. ఇక దిగిపోయిన మంత్రి, ఆయన అన్న క్రిష్ణ దాస్ అయితే తమ్ముడు మంత్రి అవుతున్నాడు   అని ఇటీవలనే  ఉప్పు అందించేశారు. దాంతో ఫుల్ కాన్ఫిడెన్స్ తో ప్రసాదరావు అనుచరులు వైసీపీ ఆఫీసు వద్ద హల్  చల్ చేస్తున్నారు. మా నాయకుడు మినిస్టర్ అని గట్టిగా నినాదాలు చేస్తున్నారు.

మరో వైపు బొత్స సత్యనారాయణ వర్గం మా నేత మళ్లీ మినిస్టర్ అవడం ఖాయమని గట్టిగా చెప్పుకుంటోంది. చూస్తూ ఉండండి కొత్త మంత్రులలో మొదటి వరసలో ఆయన పేరే ఉంటుందని కూడా అంటున్నారు. దాంతో బొత్స ఇంటి వద్ద సందడే సందడి అన్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది. అలాగే పీడిక రాజన్న దొర మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు అని ఆయన అభిమానులు హుషార్ చేస్తున్నారు.

ఆరు నూరు అయినా రాజన్న దొర మంత్రి అవడం ఖాయమని చెబుతున్నారు. అనకాపల్లి కొత్త జిల్లాలో గుడివాడ అమరనాధ్ అనుచరులదే అసలైన సంబరంగా కనిపిస్తోంది. పార్టీ ఆఫీస్ వద్ద, ఆయన నివాసం వద్ద క్యాడర్ పెద్ద ఎత్తున చేరి కాబోయే మంత్రి అని నినాదాలు చేసే సీన్ కనిపిస్తోంది.

ఇక కొత్తగా ఏర్పడిన అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి కె భాగ్యలక్ష్మి కి బెర్త్ కన్ ఫర్మ్ అయిందని వాతలు రావడంతో ఆమె వర్గం పండుగ చేసుకుంటోంది. ఆమెకు ముందు గానే అభినందన‌లు చెబుతున్నారు. ఇలా ఉత్తరాంధ్రా జిల్లాలలో పలు చోట్ల‌ కాబోయే మంత్రుల ఇళ్ల వద్ద కోలాహం కనిపిస్తోంది. అదే విధంగా తూర్పుగోదావరి జిల్లాలో దాడిశెట్టి రాజా ఇంటి వద్ద కూడా సంబరాలు మిన్నంటున్నాయి. మరి రేపటి రోజున వీరంతా మంత్రులుగా ప్రమాణం చేస్తారని నూటికి రెండు వందల శాతం అభిమానులు నమ్ముతున్నారు.
Tags:    

Similar News