ఆ సీఎంకు షాకిస్తూ కేసును సీబీఐకి ఇచ్చారు

Update: 2017-03-17 13:45 GMT
బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తాబెన‌ర్టీకి ఊహించ‌ని షాక్ త‌గిలింది. నారదా స్టింగ్ ఆపరేషన్ కేసులో బెంగాల్ సీఎంపై న‌మోదైన కేసు విచారణను సీబీఐ చేప‌ట్టాల‌ని కోల్ కత్తా  హైకోర్టు ఆదేశించింది. 72 గంటల్లోగా సీబీఐ విచారణ ప్రారంభించాలని, అవసరమైతే ఎఫ్‌ ఐఆర్ కూడా నమోదు చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. గ‌త ఏడాది మార్చిలో ఎన్నిక‌ల స‌మ‌యంలో పలువురు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు - మంత్రులు - ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకుంటున్న దృశ్యాలను నారద న్యూస్ ఏజెన్సీ బహిర్గతం చేసింది. ఇందులో టీఎంసీ నేత‌ల‌తో పాటు ఆ పార్టీ విద్యార్థి విభాగం అధ్య‌క్షుడు కూడా ఉన్నారు. ఈ ఉదంతం దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేకెత్తించింది. దీనిపై హైకోర్టు తాజా ఆదేశాలు ఇచ్చింది.

కాగా, ఈ షాకింగ్ ప‌రిణామంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందిస్తూ అవసరమైతే అత్యున్నత న్యాయస్థానానికి వెళ్తామన్నారు.  ఈ స్టింగ్ ఆపరేషన్ సీడీలు బీజేపీ కార్యాలయం నుంచి ప్రసారం అయ్యాయన్న విషయం అందరికీ తెలుసని ఆమె ఆరోపించారు. ఈ విష‌యంలో ఇప్పుడు తాను దీనిపై వ్యాఖ్యానించేది ఏమీ లేదని ఆమె తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News