కరోనా వైరస్ ...కరోనా వైరస్ ..కరోనా వైరస్ ...గత కొన్ని రోజులుగా ప్రపంచంలోని ఏ దేశంలోనైనా దీని గురించే చర్చ. చైనాలో పుట్టిన ఈ కరోనా వైరస్ , చైనాని అతలాకుతలం చేసి , ఆ తరువాత ఇతర దేశాలకి వ్యాప్తి చెందుతూ ..ప్రస్తుతం 92 దేశాలకి పాకింది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే మూడువేలమందికి పైగా చని పోయారు. దీనితో ప్రస్తుతం ఎవరు మాట్లాడుకుంటున్నా కూడా కరోనా గురించే ..సోషల్ మీడియా మొత్తం కరోనాతో నిండిపోయింది. అలాగే కరోనాకు అసలు మందు ఇదే అంటూ అనేకానేక వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ కరోనా కి ఇంకా మందు కని పెట్టలేదు.
ఈ కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న తరుణంలో ..ప్రభుత్వాలు , ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నప్పటికీ ఇంకా కొంతమంది సరైన జాగ్రత్తలు పాటించడంలేదు. ఈ కారణంతోనే ఇప్పుడు మొబైల్ సర్వీస్ ఆపరేటర్లు కూడా ఈ ప్రయత్నంలో భాగం అయినట్లుగా తెలుస్తుంది.
ఎవరు ఏ మొబైల్ నుంచి ఏ మొబైల్ నెంబర్ కి కాల్ చేసినప్పటికీ... వారిని ముందుగా కరోనా పలకరిస్తుంది. కాల్ చేయగానే మొదటి ఒక పొడి దగ్గు... వినిపిస్తుంది. అదేంటి, మనం కాల్ చేసిన తర్వాత కనీసం రింగ్ కూడా కాలేదు, అప్పుడే కాల్ లిఫ్ట్ చేశాడా అని అనిపిస్తుంది. అయితే , ఆ దగ్గు మళ్లీ వెంటనే తగ్గి పోతుంది.. ఆ తర్వాత కరోనా వైరస్ గురించిన హెచ్చరికలు మొదలవుతాయి. కరోనా వైరస్ ఎలా ప్రబలుతోంది, కరోనా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దగ్గు లేదా తుమ్ము తరచూ వస్తున్న వ్యక్తుల నుంచి కాస్త దూరంగా ఉండటం మేలు అని , అలాగే ప్రతి ఒక్కరూ మాస్క్ లు ధరించాలని ఇలా కరోనా గురించి కొన్ని సలహాలు , సూచనలు ఇచ్చిన తరువాతే మనకు ఫోన్ రింగ్ అవుతుంది.దీన్ని బట్టి ..మనం ఎవరికీ కాల్ చేసినా కూడా , మనకి ముందుగా కరోనా హెచ్చరికలు వినిపిస్తాయన్నమాట. కరోనా వైరస్ గురించి ప్రజల్లో చైతన్యం తేవడానికి ప్రభుత్వం చేస్తున్న అనేక చర్యల్లో ఇది కూడా ఒకటి.