స్థానికులకే ఉద్యోగాలు...ఇది ప్రపంచవ్యాప్తంగా ఊపందుకుంటున్న నినాదం. ఫ్రీ ట్రేడ్ వరల్డ్ పేరుతో అడ్డుగోడలు తొలగించేసిన అగ్రరాజ్యం అమెరికా తన నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పుణ్యాన తిరిగి తలుపులు బిగించుకుంటోంది. `బై అమెరికా...హైర్ అమెరికా` పేరుతో కొత్త నినాదం ఎత్తుకొని నూతన విధానాలను ప్రవేశపెట్టారు. తద్వారా వలసలపై కత్తిగట్టారు. విదేశీ ఉద్యోగులకు చెక్ పెట్టడమే ట్రంప్ అసలైన ఎజెండా అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
అగ్రరాజ్యం అమెరికా రథసారథి ట్రంప్ విధానాలను ఫాలో అవుతూ ఆ తదుపరి బ్రిటన్ - సింగపూర్ - ఆస్ట్రేలియా తాజాగా న్యూజిలాండ్ అమల్లో పెట్టాయి. ఇలా ప్రముఖ దేశాలన్నీ నైపుణ్యవంతులైన విదేశీయులపై కత్తిగట్టాయి. దీంతో ఇప్పుడు నిపుణుల్లో అయోమయం నెలకొంది. ముఖ్యంగా భారతీయులకు వణుకు ప్రారంభమైంది. అయితే తాజాగా ఓ ప్రముఖ దేశం భారతీయ ఐటీ నిపుణులకు వెల్ కం చెప్తోంది. ఆ దేశమే కెనడా. కెనడా గురించి తాజాగా వెలువడిన ఓ నివేదిక ప్రకారం ఆ దేశ ఐటీ రంగంలో పెద్ద ఎత్తున నిపుణుల అవసరం ఉంది. 2021కి ఈ దేశంలో 2.20 లక్షల ఐటీ ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయని అంచనా. కానీ, ఈ మేరకు ఈ దేశానికి మానవ వనరులు లేవు. దీంతో ఈ దేశం విదేశీ నిపుణులపై ఆధారపడాల్సి వస్తోంది. ప్రస్తుతం ఇక్కడ దాదాపు 14 లక్షల మంది ఐటీ ఉద్యోగులున్నారు. ఈ డిమాండ్ ఏటా దాదాపు మూడు శాతం పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి నైపుణ్యవంతులు మొదలుకొని ఎంట్రీ లెవల్ నాలెడ్జ్ ఉన్న వారికి సైతం కెనడా వెల్ కం చెప్తోంది.
కెనడా ఇన్మర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ కౌన్సిల్ తాజా నివేదిక ప్రకారం వర్చువల్ అండ్ ఆగ్యుమెంటెడ్ రియాలిటీ, త్రీడీ ప్రింటింగ్, బ్లాక్ చైన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 5 జీ మొబైల్ టెక్నాలజీ రంగాల్లో నిపుణులు, ఉద్యోగులకు కెనడాలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వీటితోపాటుగా డేటాబేస్ అనలిస్ట్‌లు, డేటా అడ్మినిస్ర్టేటర్లు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, డిజైనర్లకు ఇప్పుడు డిమాండ్ ఉందని, సంబంధిత రంగాల నిపుణులు, అధ్యయన నివేదికలు వెల్లడించాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/