భారతీయ సంస్థలు కస్టమైజడ్ కార్లను తయారుచేయలేవా ... మోడీ కాన్వాయ్ లో విదేశీ వాహనాలెందుకు ?

Update: 2020-11-16 13:10 GMT
భారత్ , చైనా వివాదం తర్వాత దేశంలో ఎక్కువగా లోకల్ ఫర్ వోకల్ అనే నినాదమే ఎక్కువగా వినిపిస్తుంది. విదేశీ ఉత్పత్తులపై స్థానికుల నుండి కొంచెం కొంచెంగా వ్యతిరేకత తీవ్రతరం అవుతుంది. అలాగే స్వదేశీ  ఉత్పత్తులపై మక్కువ పెరుగుతుంది. చాలామంది విదేశీ వస్తువులని వాడటం మానేస్తున్నారు. దేశంలో  తయారైన ఉత్పత్తులనే వినియోగించాలని  మోడీ పిలుపు మేరకు ఆత్మనిర్భార్ భారత్ మొదలై , రోజురోజుకి మరింత బలంగా ముందుకుపోతుంది. ఇదిలా ఉంటే ..[ప్రపంచ వ్యాప్తంగా అగ్రరాజ్యం అమెరికాతో పాటుగా కొన్ని  దేశాల ప్రధానులు, అధ్యక్షుల కోసం ప్రత్యేకించి పటిష్టమైన  భద్రతా వాహనాలను వాడుతుంటారు.

విదేశీ ప్రధానులు, అధ్యక్షులు దేశీయంగా తయారైన కార్లనే  వాడుతుంటారు. మన ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేక భద్రత కాన్వాయ్‌ కోసం విదేశీ ఉత్పత్తులపై ఆధారాపడుతున్నాం. స్వదేశీ ఆటోమొబైల్ దిగ్గజాలైన టాటా మోటార్స్, మహీంద్రా వంటి సొంత బ్రాండ్ ‌లు మనకు ఉన్నాయి. అవసరమైతే మన స్వదేశీయ సంస్థలతో ‘ఆత్మనిర్భార్ లిమోసిన్’ వాహనాలను ప్రధాని కోసం తయారు చేయవచ్చు. ప్రపంచ నేతల్లో అమెరికా అధ్యక్షులు, రష్యా అధ్యక్షులు వల్దీమిర్ పుతిన్ ఎక్కడికి వెళ్లినా కూడా స్వదేశీంలో తయారైన అధ్యక్ష వాహనాల్లోనే ప్రయాణం చేస్తుంటారు. అమెరికా అధ్యక్షులు జనరల్ మోటార్ కాడిల్లియక్ వన్ భద్రతా వాహనం అమెరికాలోనే తయారుచేశారు. 4

కానీ, మన ప్రధాని, రాష్ట్రపతులకు స్వదేశీయ కార్లు తమ క్యాన్వాయ్ లో లేవు. దీనిపై  మోడీ రోడ్లపైకి వస్తే  చర్చ జరుగుతూనే ఉంటుంది. ప్రస్తుతం మోడీ క్యాన్వాయ్ లో ఎక్కువగా విదేశీ వాహనాలే ఉన్నాయి. ప్రధాని కోసం కారును తయారు చేయమని ఇప్పటివరకు  ఏ భారతీయ సంస్థను  అడగలేదు.  ప్రస్తుతం మోడీ మూడు కార్లని వాడుతున్నారు. వాస్తవానికి.. టాటా గరుడా కారును NID విద్యార్థులు రూపొందించారు. నేషనల్ ఇన్సిస్టూట్యూట్ ఆఫ్ డిజైన్‌  కు చెందిన విద్యార్థులు కాన్సెప్ట్ స్కేల్ మోడల్‌ను డిజైన్ చేశారు. దీన్ని 2020 ఆటో ఎక్స్‌పో సమయంలో ప్రదర్శనకు ఉంచారు. నిజానికి ఇది టాటా మోటార్స్ అధికారిక కాన్సెప్ట్ కాదు.. టాప్ చీఫ్ డిజైనర్ ప్రతాప్ బోస్ కూడా ఒకప్పుడు NIDలో పూర్వ విద్యార్థి. అలాగే, మన టాటా మోటార్స్, మహీంద్రా కంపెనీలు భారత ప్రభుత్వం కోసం కస్టమైజడ్ కార్లను నిర్మించే సత్తా ఉంది.
Tags:    

Similar News