అది జగన్‌కు సొంత జిల్లా. మరో మాట చెప్పాలంటే.. వైఎస్ కుటుంబానికి నాలుగు దశాబ్దాలుగా కంచుకోట. అలాంటి జిల్లాలో ఎన్నడూ లేని విధంగా ఎప్పుడూ కనీ వినీ ఎరుగని రీతిలో జగన్‌కు వ్యతిరేకంగా ఉద్యమా లు రాజుకున్నాయి. అంతేకాదు.. ``వైసీపీకి ఇక సెలవు`` అనే బ్యానర్లు అడుగడుగునా వేలాడుతున్నాయి. మరి దీనికి కారణం ఏంటి? సీఎం జగన్ కూడా ఊహించని ఈ విపరిణామానికి రీజన్ ఎవరు? అంటే.. ప్రభుత్వం తాజాగా ప్రకటించిన జిల్లాల ఏర్పాటు! కడప జిల్లాను రెండుగా విభజిస్తూ.. ఇటీవల ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
దీనిలో ఒకటి వైఎస్సార్ జిల్లాఅయితే.. రెండోది అన్నమయ్య జిల్లా. ఇప్పుడు ఆందోళనలన్నీ కూడా.. అన్నమయ్య జిల్లా చుట్టూ జరుగుతున్నాయి. దీనిలో ప్రతిపక్షాల పాత్ర కంటే.. కూడా అధికార పార్టీ నేతల దూకుడు ఎక్కువగా ఉండడం గమనార్హం. అన్నమయ్య జిల్లాకు రాయచోటి నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా ప్రభుత్వం ప్రకటించింది. దీనిని ఇక్కడి ప్రజలు, వైసీపీ నాయకులు.. ప్రతిపక్ష నాయకులు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వారు చెబుతున్న వాదన ఏంటంటే.. రాయచోటి అసలు అభివృద్ధికి చాలా దూరంగా ఉంది.
దీనిని జిల్లా కేంద్రం చేయడం వల్ల ప్రజలకు ఒరిగేది ఏమీలేదు. ఇక, అన్నమయ్య పుట్టిన ప్రాంతానికి, రాయచొటికి అస్సలు సంబంధమే లేదు. ఆయన పుట్టిన ప్రాంతం తాళ్లపాక రాజంపేట పరిధిలో ఉంది. పైగా ఇది పార్లమెంటరీ నియోజకవర్గం బాగా అభివృద్ధి చెందిన ప్రాంతం. అందరికీ దగ్గరగా ఉన్న ప్రాంతం. సో.. రాజంపేటను అన్నమయ్య జిల్లాకు కేంద్రంగా ప్రకటించాలి.. అనేది ఇక్కడివారి డిమాండ్. అయితే.. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. దీంతో ఇక్కడి నేతలు, ప్రజలు తాజాగా మంగళవారం బంద్‌కు పిలుపునిచ్చారు.
అంతేకాదు.. రాయచోటిని కేంద్రంగా చేయడం వెనుక.. ఇక్కడి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డిని ప్రభుత్వం మంత్రి పదవి ఇవ్వనందుకు ఆయనను మచ్చిక చేసుకునే ప్రయత్నంలో భాగం ఉందనే విమర్శలు వస్తున్నాయి. రాయచోటి వల్ల తమకు ఎలాంటి లాభం లేదని.. ఇక్కడి ప్రజలు వైసీపీ నాయకులు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. రాయచోటిని మార్చకపోతే.. ఇక్కడ వైసీపీకి డిపాజిట్లు కూడా రాకుండా చేస్తామని హెచ్చరిస్తున్నారు. తాజాగా చేపట్టిన బంద్‌లో అందరూ స్వచ్ఛందం గాపాల్గొనడం గమనార్హం. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.