ఎన్ని ఉదంతాలు వెలుగులోకి వస్తున్నా.. తాగి వాహనాన్ని నడపకూడదన్న చిన్న విషయాన్ని పట్టించుకోని కారణంగా విలువైన ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాగి వాహనాన్ని నడిపి చనిపోవటం ఒక ఎత్తు అయితే.. పలు సందర్భాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ వారి కారణంగా అమాయకులు పలువురు ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి.
తాజాగా అలాంటి ప్రమాదమే ఒఒకటి జూబ్లీహిల్స్ లోని ఫిలింనగర్ లో చోటు చేసుకుంది. ఐదుగురు స్నేహితులు గెట్ టు గెదర్ పార్టీని చేసుకున్నారు. ఫుల్ గా తాగేశారు. మణికొండలో తాము చేసుకుంటున్న ప్రైవేటు పార్టీ ముగియగానే.. కారులో బయలుదేరారు. వేగంంగా కారును నడుపుతూ ఫిలింనగర్ వద్ద కారు అదుపు తప్పింది. వేగంగా డివైడర్ ను ఢీ కొనటంతో కారు నడుపుతున్న విశ్వజిత్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది.
ప్రమాదం జరిగినప్పుడు కారు ఎంత వేగంగా ఉందంటే.. డివైడర్ ను బలంగా ఢీ కొన్న కారు తర్వాత పలు పల్టీలు కొట్టటం గమనార్హం. ఈ ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంలో మరణించిన విశ్వజిత్ తో పాటు.. తీవ్రంగా గాయపడిన నలుగురి వివరాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది. వీరి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. తాగి.. వాహనాన్ని నడపొద్దన్న విషయాన్ని ఎవరికి వారే కాదు.. కుటుంబ సభ్యులు..స్నేహితులు అందరూ తమకు తెలిసిన వారికి చెప్పటం.. హెచ్చరించటం చాలా ముఖ్యం.