కత్తి మహేష్ .. తెలుగు ఫిలిం క్రిటిక్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కత్తిమహేష్ ఆ తరువాత తరచూ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. కుక్క తోక వంకర అన్నట్టుగా .. ఎన్నిసార్లు చెప్పినా కూడా కత్తిమహేష్ వ్యవహారశైలిలో మాత్రం మార్పు రావడం లేదు. గతంలో ఒకసారి రాముడి పై అనుచిత వ్యాఖ్యలు చేసి కొన్ని ఇబ్బందులని ఎదుర్కొన్నాడు. కానీ , మరోసారి తాజాగా రాముడి పై వివాదాస్పద వ్యాఖ్యలతో రెచ్చిపోయాడు.
తాజాగా రాజ్యాంగ పరిరక్షణకు సంబంధించి ఒక సమావేశం ఏర్పాటు చేసారు. ఆ సమావేశానికి హాజరైన కత్తిమహేష్ ..రాముడు తన అంత:పురంలో ఉంపుడుగత్తెలతో సుఖించేవాడని - ఆయనకు నెమలి తొడ అంటే ఇష్టమని.. సీత జింకను వండుకుని తినడం కోసమే ఆయన్ని అడవిలోకి పంపిందని ఎగతాళిగా మాట్లాడాడు. ఒక మతాన్ని కించపరిచేలా.. ఒక వర్గానికి చెందిన ప్రజల మనోభావాలు దెబ్బ తినేలా వ్యాఖ్యలు చేయకూడదన్న రాజ్యాంగ సూత్రాన్ని ఉల్లంఘిస్తూ రాజ్యాంగ పరిరక్షణ కోసం నిర్వహించిన సమావేశంలో కత్తి మహేష్ వ్యాఖ్యలు చేయడం పెద్ద చర్చనియాంశంగా మారింది. కత్తి మహేష్ రాముడి పై ఇటువంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
దీనితో , హైదరాబాద్ కు చెందిన ఉమేష్ కుమార్ అనే వ్యక్తి కత్తి మహేష్ మీద హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన పిటిషన్ లో కత్తి మహేష్ రాముడి పై చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియో లింక్ కూడా జతచేసాడు. అలాగే మా రాముడి గురించి వదిలేసి ... నీ ఏడుపు నువ్వు ఏడువు అని హిందువులు అనుకుంటున్నారు. అలాగే మరోసారి మా రాముడి గురించి ఏమైనా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తే ..తాట తీస్తాం అని సోషల్ మీడియా లో కత్తిమహేష్ కి హెచ్చరిస్తున్నారు. గతంలో రాముడి పై కేసులో ఎలాగోలా బయటపడ్డ కత్తిమహేష్ ..ఈ కేసులో నుండి ఎలా బయటపడతాడో చూడాలి. ఇకపోతే మేధావులుగా పేరున్న చాలామంది హిందూ మతం మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సర్వసాధారణమైపోయింది. కానీ, అదే మేధావులు మరోమతంలోని తప్పులు - అరాచక సంప్రదాయాల గురించి నోరెత్తరు ఎందుకో మరి వారికే తెలియాలి.