సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా ఒక వివాదంలో చిక్కుకున్నారు. రజినీకాంత్ హేతువాది - నాస్తికుడు - ద్రవిడ ఉద్యమ పితామహుడు పెరియార్ రామస్వామిపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనితో అయన పెరియార్ రామస్వామి పై చేసిన వ్యాఖ్యలు తప్పుపడుతూ ద్రవిడార్ విదుతలై ఖజగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తంతై పెరియార్ పై రజనీకాంత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ద్రవిడార్ ఆరోపించింది. రజనీపై ఎఫ్ ఐఆర్ నమోదు చేయాలని - ఐపీసీ సెక్షన్స్ 153ఏ -505 కింద కేసు నమోదు చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు.
ఇటీవల చెన్నైలో ఏర్పాటు చేసిన తమిళ మేగజైన్ తుగ్లక్ 50వ వార్షికోత్సవ వేడుకలకు రజనీకాంత్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రసంగించిన రజనీకాంత్.. పెరియార్ గురించి ప్రస్తావించారు. 1971లో పెరియార్.. రాముడు - సీతల విగ్రహాలకు చెప్పుల దండ వేసి ఊరేగించారని అన్నారు. మూఢనమ్మకాలపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు సాలెంలో ఏర్పాటు చేసిన ఓ సదస్సులో భాగంగా పెరియార్ అలా చేశారని చెప్పుకొచ్చారు. పెరియార్‌పై రజనీకాంత్ వ్యాఖ్యలను ద్రవిడార్ విడుతలై కజగం తప్పుపట్టింది. రజనీ చెప్పిన దాంట్లో ఇసుమంతైన నిజం లేదని చెప్పింది. రజనీకాంత్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని.. లేనిపక్షంలో ఆయన ఇంటిని, ఆయన నటించిన దర్బార్ సినిమా ప్రదర్శించబడుతున్న థియేటర్లను ముట్టడిస్తామని హెచ్చరించింది. కోయంబత్తూరు కమిషనర్ కు ఆయనపై ఫిర్యాదు చేసింది
ఇక అదే కార్యక్రమంలో డీఎంకె అధికారిక పత్రిక మురసోలిపై రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమయ్యాయి. మురసోలిని చదివే పాఠకులు చాలావరకు డీఎంకె కార్యకర్తలే. కానీ తుగ్లక్ మేగజైన్ ను చదివే వాళ్లలో చాలామంది మేదావులు ఉంటారు అని రజనీ మాట్లాడారు. రజనీ వ్యాఖ్యలపై డీఎంకె కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ద్రవిడార్ విడుతలై కజగం పెట్టిన కేసులపై రజనీకాంత్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. పెరియార్ పై చేసిన వ్యాఖ్యలకు ఆయన కట్టుబడి ఉంటారా.. లేక ద్రవిడార్ సంస్థ డిమాండ్ మేరకు క్షమాపణలు చెబుతారా అన్న చర్చ జరుగుతోంది. త్వరలో రజనీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న తరుణంలో ఈ వివాదం నుండి ఎలా బయటపడతారో అని అందరూ చర్చించుకుంటున్నారు.