నయీం గ్యాంగ్‌ పై ఆంధ్రప్రదేశ్‌ లో తొలి కేసు!

Update: 2016-09-02 09:39 GMT
గత కొన్ని రోజులుగా గ్యాంగ్ స్టర్ నయీం కి సంబందించిన హాట్ న్యూస్ లు నడుస్తున్నాయి. తెలుగురాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలోనూ, తెలుగు రాష్ట్రాల సరిహద్దు రాష్ట్రాల్లోనూ నయీఇం సాగించిన దందాలు, చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ సమయంలో నయీం దందాలు ఏపీలో కూడా బాగానే ఉన్నాయని వార్తలు వస్తున్నా.. ఇప్పటివరకూ అధికారికంగా ఒక్క కేసుకూడా నమోదు కాలేదు. అయితే తాజాగా ఆ విషయం పై కూడా వార్తలు వస్తున్నాయి.

ఏపీలోణి ఒక భూ వివాదంలో నయీం అనుచరులమని బెదిరించిన ఘటనపై ఒక కేసు నమోదు చేసినట్లు విశాఖ జిల్లా భీమిలి సిఐ అప్పలనాయుడు తెలియజేశారు. భీమిలి మండలం కాపులుప్పాడలో సర్వే నెంబర్లు 117/4 - 117/5 - 117/6 - 117/7 - 117/9 - 117/22 లలో సుమారు అయిదెకరాల భూమిని 1988లో విజయనగరం జిల్లా అంపావల్లికి చెందిన బొడ్డూరి భూషణం అన్ రిజిస్టర్ ద్వారా కొనుగోలు చేసేందుకు స్థలాల యాజమాన్యాల నుండి ఒప్పందం కుదుర్చుకుని, ఒప్పందం ప్రకారం భూమిని స్వాధీనం చేసుకున్నాడు. అయితే భూషణం 2014లో తన భూమి వద్దకు వెళ్లి చూడగా అది కబ్జాకు గురైంది. ఈ నేపథ్యంలో విశాఖకు చెందిన సూర్యనారాయణవర్మ ఆ భూమి తనదని, 2007లో తాము కొనుగోలు చేశానని, పైగా తాము నయీం అనుచరులమని చెప్పాడట. తమకు అడ్డొస్తే పరిస్థితులు మామూలుగా ఉండమని, ఈ భూమిపై ఆశలు వదుకోకపోతే అంతు చూస్తామని బెదిరించారట. ఈ విషయాలను సీఐ అప్పల నాయుడు తెలిపారు.

కాగా భూషణాన్ని కులం పేరుతో కూడా దూషించారన్న దానిపై నయీం అనుచరులుగా భావిస్తున్న వారిపై ఎస్సీ - ఎస్టీ సెల్ ఎసిపి మోహనరావు కేసును పరిశీలిస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పటివరకూ వార్తలే కాని కేసులు లేని ఏపీలో మొట్టమొదటిసారి నయీం పేరున జరిగిన అరాచకాలు - ఆగడాలపై కేసు నమోదయ్యింది.
Tags:    

Similar News