నోటి దురదే కాకుండా చేతి దురదా ఎక్కువే అని పలుమార్లు నిరూపించుకున్న టీడీపీ ఎమ్మెల్యే - ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈసారి ఓ పోలీసు అధికారిని దుర్భాషలాడడంతో ఆయన కేసు పెట్టారు. తన విధులకు ఆటంకం కలిగించారని కంప్లయింట్ చేయడంతో ఈ కేసు నమోదైంది.
పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లిలో అమ్మవారి జాతర సందర్భంగా భారీ వాహనాల రాకపోకలు నియంత్రించేందుకు దెందులూరు మండలం సిగవరం కూడలి వద్ద ఏఎస్సై - ఇద్దరు పోలీసులను నియమించారు. ఆ ముగ్గురు విధుల్లో ఉండి, వాహనాలు మళ్లిస్తున్న క్రమంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అక్కడికి వచ్చి... ఇక్కడేం చేస్తున్నారంటూ ఎఎస్సైని దుర్భాషలాడడంతో పాటు, ఇద్దరు సీపీవోలపై దాడికి దిగారు.
దీంతో ఏఎస్సై పాపారావు దెందులూరు పోలీస్ స్టేషేన్ లో ఫిర్యాదు చేయగా ఎమ్మెల్యేపై 323 - 353 - 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా చింతమనేని గతంలో రెవెన్యూ అధికారి వనజాక్షిపై చేయి చేసుకోవడం... అంగన్ వాడీ కార్యకర్తలను అనరాని మాటలు అనడం తెలిసిందే. ఇప్పుడు పోలీసు అధికారులపైనా జులుం చూపించాలనుకోగా కథ అడ్డం తిరిగింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/