బాబు ప్రస్ట్రేషన్... కేసు నమోదైపోయింది

Update: 2019-11-23 03:20 GMT
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు... తనను తాను 40 ఇయర్స్ ఇండస్ట్రీగా చెప్పుకుంటున్న వైనం తెలిసిందే. నాలుగు దశాబ్దాల పాటు రాజకీయాల్లో కొనసాగిన నేతకు ఎంత ఓపిక, సహనం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే చంద్రబాబు విషయంలో మాత్రం ఈ సూత్రం తిరగబడిపోయింది. అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా బాబులో ప్రస్ట్రేషన్ ఓ రేంజిలో గూడుకట్టుకుని పోయింది. అది అధికారంలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు మాత్రమే బయటకు వస్తే... విపక్షంలోకి మారగానే అది నిత్యం బయటకు తన్నుకుంటూనే వస్తోంది. ఈ తరహా వ్యవహార సరళి కారణంగా ఇప్పుడు చంద్రబాబుపై ఏకంగా ఓ పోలీస్ కేసు నమోదైపోయింది.

ఆ కేసేమిటి? దానికి దారి తీసిన పరిణామాలు ఏమిటన్న వివరాల్లోకి వెళితే.... మొన్నామధ్య తిరుమల శ్రీవేంకటేశ్వరుడి మహా ప్రసాదం లడ్డూ ధరలను పెంచుతున్నట్లుగా టీడీపీ అనుకూల మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే అలాంటి ప్రతిపాదనలేమీ లేవని స్వయంగా టీడీడీ బోర్డు చైర్మన్ గా ఉన్న జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. అయినా కూడా వినని చంద్రబాబు... తిరుపతి లడ్డూను మద్యంతో పోల్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్... మద్యం ధరలను పెంచినట్టుగానే, తిరుమల లడ్డూ ప్రసాదం ధరలను పెంచుతున్నారని, పేదలకు లడ్డూను దూరం చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. మద్యనిషేధం చేస్తామంటూ ధరలను పెంచుతున్నారని, అలాగే తిరుమలకు భక్తులు రాకుండా ఉండాలన్న ఉద్దేశంతో లడ్డూ ధరలను, రూముల ధరలను పెంచుతున్నారని చంద్రబాబు తనదైన శైలి ప్రస్ట్రేషన్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు.

మత విధ్వేషాలను రెచ్చగొట్టేలా, ఓ మతం మనోభావాలు దెబ్బ తీసేలా ఏ చిన్న నేత అయినా, ఏ చిన్న వ్యాఖ్య చేసినా కూడా అది సంచలనంగానే మారుతోంది. అలాంటిది 15 ఏళ్ల పాటు సీఎంగా పనిచేసిన చంద్రబాబు నోట నుంచి తిరుపతి లడ్డూ ధరలను మద్యం ధరలతో పోల్చేసే వ్యాఖ్యలు రావడంతో నిజంగానే ఆ వ్యాఖ్యలు పెను కలకలమే రేపాయి. చంద్రబాబు వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో తిరుపతి పోలీసులు చంద్రబాబుపై కేసు నమోదు చేసి పారేశారు. మరి ఈ కేసు నుంచి చంద్రబాబు ఎలా బయటపడతారో చూడాలి?

Tags:    

Similar News