ఓటుకు నోటు వ్యవహారం సుప్రీంకు చేరింది

Update: 2015-07-02 09:07 GMT
ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డితో పాటు మరో ఇద్దరికి రాష్ట్ర హైకోర్టు బెయిల్‌ ఇవ్వటం తెలిసిందే. దీనిపై అవినీతి నిరోధక శాఖ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఈ కేసుకు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో.. బెయిల్‌ మంజూరు చేస్తే సాక్ష్యుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ పిటీషన్‌ దాఖలు చేసింది. రేవంత్‌ తదితరులకు ఇచ్చిన బెయిల్‌ను తక్షణమే ఉపసంహరించాలని కోరుతోంది.

ఓటుకు నోటుకు సంబంధించిన దర్యాప్తు కీలకదశలో ఉందని.. మరిన్ని ఆధారాలు సేకరించే పనిలో ఉన్న నేపథ్యంలో.. బెయిల్‌ మంజూరు కావటం కేసుపై ప్రభావం చూపించే వీలుందని ఏసీబీ కోరుతోంది. మరి.. ఏసీబీ దాఖలు చేసిన ఆర్జీపై సుప్రీం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి హైదరాబాద్‌లో మొదలైన ఓటుకు నోటు వ్యవహారం ప్రస్తుతం సుప్రీంకోర్టుకు చేరినట్లు అయ్యింది. ఏసీబీ దాఖలు చేసిన పిటీషన్‌పై శుక్రవారం విచారణకు రానుంది.  మరి.. దీనిపై సుప్రీం స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News