కేసీఆర్ జాబితాలో సామాజిక స‌మీక‌ర‌ణాలిలా!

Update: 2018-09-07 10:12 GMT
ముంద‌స్తుకు వెళ్లేందుకు సిద్ధం కావ‌ట‌మే కాదు.. ముంద‌స్తుగా ఎలా త‌యారు కావాలో చేత‌ల్లో చేసి చూపించారు కేసీఆర్‌. ఏదో వెళుతున్నామంటే వెళుతున్నామ‌న్న‌ట్లు కాకుండా గురి చూసి వ‌దిలిన బాణం మాదిరి దూసుకెళ్లాల‌న్న‌ట్లుగా ముంద‌స్తు వ్యూహం ఉందంటున్నారు.

ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు సంబంధించి 105 అభ్య‌ర్థులను ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అత్య‌ధికం సిట్టింగుల‌కు ఇవ్వ‌టంతో పాటు.. గ‌తంలో పార్టీ త‌ర‌ఫున పోటీ చేసిన అభ్యర్థుల‌ను దాదాపుగా ఖ‌రారు చేయ‌టం క‌నిపిస్తుంది. ఇక‌.. కేసీఆర్ విడుద‌ల చేసిన అభ్య‌ర్థుల జాబితాను సామాజిక స‌మీక‌ర‌ణాల కోణంలో చూస్తే.. ఆస‌క్తిక‌ర అంశాలు క‌నిపిస్తాయి. ఎవ‌రెన్ని చెప్పినా.. ఎన్నిక‌ల వ‌ర‌కూ వ‌చ్చేస‌రికి.. కుల‌స‌మీక‌ర‌ణాలు కీల‌క పాత్ర పోషిస్తాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

కేసీఆర్ విడుద‌ల చేసిన 105 మంది అభ్య‌ర్థుల సామాజిక స‌మీక‌ర‌ణాల్ని చూస్తే..

రెడ్లు    35
క‌మ్మ   06
బ్రాహ్మణులు 01
వైశ్య          01
క్ష‌త్రియ      01
బీసీ          14
మున్నూరుకాపులు 06
మాదిగ       08
కోయ         07
మాల        07
బంజ‌ర       07
ముస్లిం      02


Tags:    

Similar News