విమానంలో పిల్లి బీభత్సం ..గాల్లో ఉండగా కాక్‌పిట్‌లో పైలట్‌పై దాడి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే ?

Update: 2021-03-05 01:30 GMT
విమానం లోకి సాధరణంగా ఎవరూ కూడా అంత సులభంగా ఎక్కలేరు. ఒకటికి పది సార్లు ఎయిర్ పోర్ట్ లో చెక్ చేసిన తర్వాతనే విమానంలోకి ఎక్కడానికి అనుమతిస్తారు. విమానం లోకి సిబ్బందికి తెలియకుండా ఈగ కూడా దూరదు అంటారు. కానీ , ఓ పిల్లి మాత్రం ఎవరికీ తెలియకుండా విమానంలోకి ఎక్కి విమానం లో బీభత్సం సృష్టించింది. కాక్ పిట్ లోకి వెళ్లి పైలట్‌పై దాడి చేయడంతో దెబ్బకి గాల్లోకి ఎగిరిన విమానం గమ్యస్థానం చేరకుండానే యూటర్న్ తీసుకోని ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. సూడాన్‌ లో ఈ ఘటన జరిగింది.  

వివరాల్లోకి వెళ్తే .. సుడాన్ టార్కో విమానం ఖార్టూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఓ విమానం బయలుదేరింది. అయితే , టేకాఫ్ అయిన కొద్దిసేప‌టికే పిల్లి పైలట్ పై దాడి చేయ‌డం వ‌ల్ల అరగంట సేపు విమానం గాలిలోనే ఉండాల్సి వ‌చ్చింది. స్థానిక మీడియా నివేదికల ప్రకారం, స్టొవ‌వే ఫిలైన్ జాతికి చెందిన ఈ పిల్లి విమానం బయలుదేరే ముందు ఎలా జొర‌బ‌డిందో గానీ కాక్ పిట్ లోకి ప్రవేశించింది. మొత్తానికి ఆ త‌ర్వాత కాక్‌ పిట్‌ లో దీన్ని గ‌మ‌నించి, బ‌య‌ట‌కు పంపేయ‌డానికి ప్ర‌‌య‌త్నించినా ఫ‌లితం లేదు.  కాక్ పిట్‌లో ఏర్ప‌డిన ఈ గందరగోళానికి విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వ‌చ్చింది. పైలట్‌కు మ‌రో దారి లేక‌ ఖార్టూమ్‌కు తిరిగి రావ‌డం త‌ప్ప‌నిస‌రి అయ్యింది. అయితే ఇందులోని ప్ర‌యాణికులంతా సుర‌క్షింతంగానే ఉన్నారు.

ఇంత‌కీ ఈ విమానంలోకి పిల్లి ఎలా వ‌చ్చి, చేరిందో ఇప్ప‌టికీ స్పష్టంగా తెలియదు. అయితే విమానం లోప‌ల క్లీన్ చేసేట‌ప్పుడో, లేదంటే ఇంజనీరింగ్ చెక్ చేసేటప్పుడో ఈ పిల్లి ఎవ్వ‌రి కంటా ప‌డ‌కుండా ఆన్ బోర్డ్ ‌లోకి ప్ర‌వేశించి ఉండొచ్చని ప‌లు ర‌కాల అభిప్రాయాలు ఉన్నాయి. అయితే ఈ విమానం ప్ర‌యాణానికి ముందు రోజు రాత్రి అదే విమానాశ్రయంలో ఒక హ్యాంగర్ ద‌గ్గ‌ర హాల్ట్‌ లో ఉంది. ఇలా ఆగి ఉన్న స‌మ‌యంలో ఈ పిల్లి విమానంలోకి వెళ్లి ఉంటుంద‌నే సందేహాలూ వ్య‌క్త‌మ‌వుతున్నాయి.
Tags:    

Similar News