అల్లుడుగారు మ‌రో కేసులో బుక్ అయ్యారా?

Update: 2019-06-23 04:24 GMT
అల్లుడిగారిగా అంద‌రూ చెప్పుకునే యూపీఏ ఛైర్ ప‌ర్స‌న్ సోనియాగాంధీ అల్లుడు రాబ‌ర్ట్ వాద్రా పీక‌కు మ‌రో కుంభ‌కోణం చుట్టుకోనుందా? అంటే అవున‌న్న మాట వినిపిస్తోంది. ఇప్ప‌టికే ప‌లు ఆరోప‌ణ‌లు.. కొన్ని కేసులు చుట్టుకున్న ఆయ‌న‌పై తాజాగా వెల్లువెత్తుతున్న ఆరోప‌ణ సంచ‌ల‌నంగా మారింది.

శిక్ష‌ణ విమానాల కొనుగోలులో భారీగా అక్ర‌మాలు చోటు చేసుకున్నాయ‌న్న ఆరోప‌ణ‌ల‌పై వాద్రా ముఖ్య అనుచ‌రుడు క‌మ్ వివాదాస్ప‌ద ఆయుధ డీల‌ర్ సంజ‌య్ భండారీపై సీబీఐ కేసు న‌మోదు చేసింది. ఆయ‌న‌తో పాటు ఐఎఎఫ్.. ర‌క్ష‌ణ శాఖ‌కు చెందిన మ‌రికొంద‌రు అధికారులు.. విమానాల‌ను త‌యారు చేసిన స్విస్ కంపెనీ పైలాట‌స్ పైనా కేసు న‌మోదు చేశారు.

యూపీఏ హ‌యాంలో జ‌రిగిన ఒప్పందంలో భారీగా అవ‌క‌త‌వ‌క‌లు.. అవినీతి జ‌రిగింద‌న్న‌ది సీబీఐ ఆరోప‌ణ‌. 2009లో 75 పైలాట‌స్ ఫ్లైట్ల‌ను కొనుగోలు చేశారు. ఈ ఒప్పందం విలువ రూ. 2895 కోట్లు. ఈ విమానాల కాంట్రాక్టును తొలుత ప్ర‌క‌టించిన‌ప్పుడు పైలాట‌స్ ఒక‌టైతే.. ఈ సంస్థ ఆఫ్ సెట్ ఇండియా ప్రైవేట్ స‌ర్వీసెస్ అనే కంపెనీతో డిఫెన్స్ ప్రొక్యూర్ మెంట్ రూల్స్ కు విరుద్ధంగా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీని ప్ర‌కారం భార‌త వైమానిక ద‌ళం త‌మ విమానాలు కొనుగోలు చేసేట‌ట్లు స‌హ‌క‌రించేందుకు వీలుగా నిర్ణ‌యం జ‌రిగింది.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే ఈ ఆఫ్ సెట్ ఇండియా కంపెనీ సంజ‌య్ భండారీది. ఆయ‌న‌తో పాటు బిమ‌ల్ శ‌రీన్ అనే మ‌రో డీల‌ర్ ఈ సంస్థ‌కు డైరెక్ట‌ర్లు కావ‌టం గ‌మ‌నార్హం. ఈ ఒప్పందంలో భాగంగా భారీ ఎత్తున నిధులు ప‌క్క‌దారి ప‌ట్టిన‌ట్లుగా అనుమానిస్తున్నారు. ఈ ఒప్పందంలోనే రాబ‌ర్ట్ వాద్రా లండ‌న్ లో ఖ‌రీదైన విల్లాలు.. అపార్ట్ మెంట్లు కొనుగోలు చేసిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దీనికి సంబంధించిన ఒక కేసులో వాద్రా అనుచ‌రుడు భండారీ నిందితుడిగా ఉన్నారు. 
Tags:    

Similar News