దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావో దారుణంపై సీబీఐ తాజాగా సంచలన నిజాన్ని బయటపెట్టింది. ఇప్పటివరకూ ఆరోపణలుగా ఉన్నట్లు ఉన్నావో బాలికపై బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ రేప్ చేసిన మాట నిజమేనని తేల్చింది.
యూపీలో జరిగిన ఈ ఉదంతం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ ఈ ఆరోపణలు తప్పని వాదిస్తున్న బీజేపీ నేతల నోట ఇక రానట్లే. గత ఏడాది జూన్ 4న బాధిత బాలికపై బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ రేప్ చేసినట్లుగా సీబీఐ నిర్దారించింది. అంతేకాదు.. బాలిక ఫిర్యాదును స్వీకరించటం.. కేసు నమోదు చేయటంలో స్థానిక పోలీసులు నిర్లక్ష్యం వహించినట్లుగా తేలింది. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఎమ్మెల్యే వద్దకు తీసుకెళ్లిన శశిసింగ్ బాధితురాలు అత్యాచారానికి గురి కావటానికి కారణమైందని తేలింది.
దారుణమైన విషయం ఏమిటంటే.. ఉన్నావో బాలికను రేప్ చేసే సమయంలో ఎమ్మెల్యే గది బయట ఆయన స్నేహితురాలు శశిసింగ్ ఉన్నట్లుగా విచారణలో బయటపడింది. బాధితురాలి వాంగ్మూలాన్ని తాజాగా సీబీఐ అధికారులు మేజిస్ట్రేట్ ఎదుట రికార్డు చేశారు. ఈ వాంగ్మూలం తదుపరి విచారణకు చెల్లుతుంది. అత్యాచారానికి గురైన బాలికకు సకాలంలో వైద్య పరీక్షలు నిర్వహించే విషయంలోనూ.. దారుణం జరిగినప్పుడు ఆమె ధరించిన దుస్తుల్ని ఫోరెన్సిక్ ల్యాబ్ కు కావాలనే పంపలేదన్న విషయాన్ని తేల్చింది
ఎమ్మెల్యే అత్యాచారాన్ని కాపాడేందుకు స్థానిక పోలీసులు కుమ్మక్కు అయినట్లుగా స్పష్టం చేసిన సీబీఐ తాజా విచారణ.. తర్వాత వివిధ సంఘాల ఆందోళనతో ఈ దారుణం బయటకు వచ్చింది. అత్యాచారం అనంతరం ఆ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తామని బెదిరించంతో ఆమె నోరు విప్పలేదు. ఘటన జరిగిన ఏడు రోజులకు ఎమ్మెల్యేనే కాకుండా శుభం సింగ్.. అవధ్ నారాయణ్.. బ్రిజేష్ యాదవ్ లు బాలికపై పలుమార్లు సామూహిక అత్యాచారాలు చేయటంతో భరించలేని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా పోలీసులు పట్టించుకోలేదు.
తర్వాతి దశలో ఈ వ్యవహారం ప్రజాసంఘాల వద్దకు వెళ్లటం వారు ఆందోళనలు చేయటంతో ఎమ్మెల్యే మినహా మిగిలిన నిందితులపై కేసులు నమోదు చేశారు. అనంతరం ఈ ఇష్యూ దేశ వ్యాప్తంగా చర్చ రేగటంతో బీజేపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో అధికారపార్టీ నేతను వెనకేసుకొస్తున్నారన్న అపకీర్తి యోగి సర్కార్ కు చుట్టుకుంది. దీంతో.. సీబీఐకి ఈ కేసు విచారణను అప్పజెప్పారు. తాజాగా.. ఆరోపణలు నిజమని.. బీజేపీ ఎమ్మెల్యే అత్యాచారానికి పాల్పడినట్లుగా తేలింది. మరి.. ఇంత దారుణానికి పాల్పడిన ఎమ్మెల్యేపై వేటు వేయటానికి మోడీ ఎందుకు ఉపేక్షిస్తున్నట్లు? షాకు చెప్పి ఆ పని ఎందుకు చేయనట్లు..?