సీబీఎన్ : ఆ ముగ్గురూ ఆయ‌న నుంచి ఏం నేర్చుకున్నారు ?

Update: 2022-04-21 01:04 GMT
నాయ‌క‌త్వం అంటే ఒక‌రి నుంచి వ‌చ్చేది కాదు.. నాయ‌క‌త్వం మ‌రియు వార‌స‌త్వం ఒక్క‌టి కావు. అందుకే లోకేశ్ నాయ‌కుడిగా ఎద‌గ‌లేక‌పోతున్నారు అన్న‌ది ఓ విమ‌ర్శ.  లోకేశ్ నేర్చుకోవాల్సింది ఎంతో ! జ‌గ‌న్ తో పోలిస్తే లోకేశ్  కు మాస్ ఫాలోయింగ్ లేదు. ముఖ్యంగా ఆయ‌న‌కు వాగ్ధాటి లేదు.

ఇవే ఆయ‌న‌కు ప్ర‌ధాన ఇబ్బందులు. ఆ మాట‌కు వ‌స్తే ఇప్పుడున్న ఆంధ్రా నేత‌ల్లో జ‌గన్ కానీ చంద్ర‌బాబు కానీ అంత వాగ్ధాటి ఉన్న వారు కాదు. కానీ ఎంతో కొంత త‌మ మాట తీరుతో ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకోవాల‌ని ప‌రిత‌పిస్తారు. ఇదే స‌మ‌యంలో చంద్ర‌బాబుతో పోల్చినా లోకేశ్ కు మాట్లాడ‌డంలో మెల‌కువ‌లు అస్స‌లు రావు. తెలియ‌వు కూడా !

ఇక లోకేశ్ సంగ‌తి అటుంచితే చంద్ర‌బాబు ద‌గ్గ‌ర ఆ రోజు పొలిటిక‌ల్ పాఠాలు నేర్చుకున్న ఆ ఇద్ద‌రి గురించి మాట్లాడుకుందాం. ఎలా చూసుకున్నా చంద్ర‌బాబుకు దీటుగా కేసీఆర్ ఎదిగి ఉన్నారు. ఆయ‌న కూడా చంద్ర‌బాబు మాదిరిగానే ప్ర‌త్యామ్నాయ నాయ‌కుల తయారీకి పెద్ద‌గా ఇష్ట‌ప‌డ‌రు. బిడ్డ‌లనే రేప‌టి ప్లీన‌రీలో జాతీయ స్థాయిలో రాణించే ఫ్యూచ‌ర్ లీడ‌ర్లుగా ఫోక‌స్ చేయ‌నున్నారు.

ఆ విధంగా చూసుకున్నా కేసీఆర్ కొన్ని విషయాల్లో గురువు చంద్ర‌బాబు క‌న్నా జాగ్ర‌త్త ప‌రుడు. నీటి వివాదాల‌పై చంద్ర‌బాబు క‌న్నా ఇవాళ మాట్లాడ‌గ‌ల‌రు. కానీ ఒక‌నాడు ఇంత‌టి దూకుడుతో కేసీఆర్ లేని రోజుల్లో ఆయ‌న మొద‌ట పొలిటిక‌ల్ సైన్స్ కు సంబంధించిన పాఠాలు విన్న‌ది చంద్ర‌బాబు ద‌గ్గ‌రే ! అయినా కూడా కేసీఆర్ కు తెలిసినంత భావోద్వేగ రాజ‌కీయం చంద్ర‌బాబుకు తెలియ‌దు. అందుకే ఈ ఒక్క విష‌యంలో చంద్ర‌బాబు క‌న్నా కేసీఆర్ ఎంతో దూసుకుపోయారు.

ఆ విధంగా చెప్పాలంటే కేసీఆర్ నుంచే చంద్ర‌బాబు ఈ ఒక్క విష‌యం త‌ప్ప‌క నేర్చుకోవాల్సిందే. మ‌రో లీడ‌ర్ రేవంత్ కూడా ప్ర‌స్తుతం తెలంగాణ కాంగ్రెస్ కు బాస్ గా ఉన్నా కూడా ప్ర‌జా పోరాటాల‌కు పెద్ద‌గా ప్రాధాన్యం ఇవ్వ‌డం లేదు.ఈ  విష‌య‌మై ఒక నాయ‌కుడిగా ఎద‌గాలంటే ముందుగా ప్ర‌జా క్షేత్రంలో పోరు బాట త‌ప్ప‌దు. అందుకు ఆ రోజు చంద్ర‌బాబు అందించిన స్ఫూర్తికి అనుగుణంగా, అందుకు త‌గ్గ విధంగా రేవంత్ త‌నని తాను తీర్చిదిద్దుకుంటున్నారు.

పొలిటిక‌ల్ కెరియ‌ర్ ప‌రంగా ఎంత ఇబ్బంది ప‌డుతున్నా చంద్ర‌బాబు మాదిరిగానే రేవంత్ కూడా వీలున్నంత త‌ప్పుకునేందుకే చూస్తారు. అదేవిధంగా అదే ప‌నిగా వివాదాలు కొన‌సాగ‌నివ్వ‌రు. ఇందుకు కూడా బాబే సాక్ష్యం. ఎలా చెప్పుకున్నా మాట్లాడుకున్నా రేవంత్ మాత్రం టీపీసీసీని బ‌లోపేతం చేసే క్ర‌మంలో కొన్ని సూత్రాల అమ‌లులో మాత్రం చంద్ర‌బాబునే ఫాలో అవుతారు. ఇదే త‌థ్యం కూడా!
Tags:    

Similar News