చిన్న ఆకతాయి పని, ఏదో సరదా అనుకున్నారు.. వంతనకు మధ్యలో నిలబడి దానిని అటు ఇటు ఊపడం ప్రారంభించారు. అంతే! ఇంకేముంది.. 140 మంది ప్రాణాలు నీళ్లలో కలిసిపోయాయి. ఒక్కొక్కసారి చేసే ఈ చిన్నపాటి ఆకతాయి పనులు ఎంత పెను ప్రమాదాలను మోసుకువస్తాయో చెప్పడానికి తాజాగా గుజరాత్‌లో జరిగిన ఘోరమే ఉదాహరణగా నిలిచింది.
ఏం జరిగింది? గుజరాత్‌లో ఘోర ప్రమాదం జరిగింది. మోర్బీ పట్టణంలో కేబుల్ బ్రిడ్జి కుప్పకూలిపోయింది. మచ్చూ నదిపై నిర్మించిన ఈ కేబుల్ బ్రిడ్జిపై నుంచి పెద్ద సంఖ్యలో సందర్శకులు నదిలో పడిపోయారు.
ఈ ఘటనలో ఇప్పటి వరకు 140 మంది మృతి చెందగా.. వందల సంఖ్యలో గాయపడ్డారు. వంతెన తెగిన సమయంలో దానిపై 500 మంది ఉండగా.. వీరిలో 100 మందికి పైగా నదిలో నీటిలో మునిగిపోయారు. చాట్ పూజ నేపథ్యంలో యువత, మహిళలు నదికి పూజలు చేసేందుకు వచ్చారని అధికారులు తెలిపారు.
దాదాపు వందేళ్ల క్రితం నాటి ఈ వంతెనకు ఇటీవలే మరమ్మతు పనులు పూర్తి చేసి తిరిగి ప్రజల సందర్శన కోసం తెరిచారు. అది జరిగిన నాలుగైదు రోజులకే ఈ దుర్ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఆదివారం సాయంత్రం పెద్ద సంఖ్యలో జనం ఈ వంతెనపై నిలబడటంతో సామర్థ్యానికి మించి బరువు కావడం వల్ల కూలినట్టుగా మొదట అధికారులు అంచనా వేశారు.
తాజాగా వెలుగులోకి సీసీ ఫుటేజీ గుజరాత్ మోర్బీలో తీగల వంతెన కుప్పకూలిన దృశ్యాలు సీసీటీవీకి చిక్కాయి. వంతెన కూలిపోవడం, అంతకుముందు జరిగిన పరిణామాలు అందులో రికార్డయ్యాయి. ప్రమాదానికి ముందు బ్రిడ్జిపై భారీ సంఖ్యలో సందర్శకులు కనిపిస్తున్నారు.
కొందరు ఆకతాయిలు వంతెన తీగలను పట్టుకొని అటూఇటూ ఊపుతున్న దృశ్యాలు కనిపించాయి. ఈ క్రమంలోనే వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో దానిపై ఉన్నవారంతా నీటిలో పడిపోయారు. ఈ దుర్ఘటనలో 140 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.Full View
ఏం జరిగింది? గుజరాత్‌లో ఘోర ప్రమాదం జరిగింది. మోర్బీ పట్టణంలో కేబుల్ బ్రిడ్జి కుప్పకూలిపోయింది. మచ్చూ నదిపై నిర్మించిన ఈ కేబుల్ బ్రిడ్జిపై నుంచి పెద్ద సంఖ్యలో సందర్శకులు నదిలో పడిపోయారు.
ఈ ఘటనలో ఇప్పటి వరకు 140 మంది మృతి చెందగా.. వందల సంఖ్యలో గాయపడ్డారు. వంతెన తెగిన సమయంలో దానిపై 500 మంది ఉండగా.. వీరిలో 100 మందికి పైగా నదిలో నీటిలో మునిగిపోయారు. చాట్ పూజ నేపథ్యంలో యువత, మహిళలు నదికి పూజలు చేసేందుకు వచ్చారని అధికారులు తెలిపారు.
దాదాపు వందేళ్ల క్రితం నాటి ఈ వంతెనకు ఇటీవలే మరమ్మతు పనులు పూర్తి చేసి తిరిగి ప్రజల సందర్శన కోసం తెరిచారు. అది జరిగిన నాలుగైదు రోజులకే ఈ దుర్ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఆదివారం సాయంత్రం పెద్ద సంఖ్యలో జనం ఈ వంతెనపై నిలబడటంతో సామర్థ్యానికి మించి బరువు కావడం వల్ల కూలినట్టుగా మొదట అధికారులు అంచనా వేశారు.
తాజాగా వెలుగులోకి సీసీ ఫుటేజీ గుజరాత్ మోర్బీలో తీగల వంతెన కుప్పకూలిన దృశ్యాలు సీసీటీవీకి చిక్కాయి. వంతెన కూలిపోవడం, అంతకుముందు జరిగిన పరిణామాలు అందులో రికార్డయ్యాయి. ప్రమాదానికి ముందు బ్రిడ్జిపై భారీ సంఖ్యలో సందర్శకులు కనిపిస్తున్నారు.
కొందరు ఆకతాయిలు వంతెన తీగలను పట్టుకొని అటూఇటూ ఊపుతున్న దృశ్యాలు కనిపించాయి. ఈ క్రమంలోనే వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో దానిపై ఉన్నవారంతా నీటిలో పడిపోయారు. ఈ దుర్ఘటనలో 140 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.