దేశంలోని మహారాష్ట్ర - హర్యానా అసెంబ్లీ ఎన్నికలతో పాటు 17 రాష్ట్రాల్లోని 51 అసెంబ్లీ స్ధానాలు - రెండు లోక్ సభ స్ధానాల ఉప ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సెలబ్రిటీలు కూడా క్యూలో నిల్చొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సినీ సెలబ్రిటిలే కాకుండా రాజకీయ వర్గాల వారు - వివిధ రంగాల్లో ఉన్న ప్రముఖులు కూడా సంపూర్ణంగా ఉపయోగించుకుంటున్నారు. వీరిలో సినీ ప్రముఖులు జెనీలియా - రితేష్ దేశ్‌ముఖ్ - రవి కిషన్ - కిరణ్ రావ్ - అమీర్ ఖాన్ లు - టెన్నిస్ ఆటగాడు మహేశ్ భూపతి - లారాదత్త తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కాగా, ఈ ఎన్నికల ఫలితా అక్టోబర్ 24న మహారాష్ట్ర - హరియాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అదే విధంగా ఈ ఎన్నికల్లో పలువురు సెలబ్రిటీలు కూడా బరిలో నిలిచారు. దాద్రి నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున బరిలో నిలిచిన రెజ్లర్ బబితా ఫొగాట్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో ఉన్నారు.. వీరే కాకుండా ఈ ఎన్నికల్లో బరోడా నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున బరిలో ఉన్న, ఒలంపిక్ పతక విజేత - స్టార్ రెజ్లర్ యోగేశ్వర్ దత్ - ఎన్సీపీ నాయకురాలు సుప్రియా సూలే బారామతిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
బారామతి అసెంబ్లీ స్థానంలో ఎన్సీపీ తరపున అజిత్ పవార్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ నాగ్ పూర్ లోని మహాల్ పోలింగ్ బూత్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరే కాకుండా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ - ఆయన సతీమణి అమృత - తల్లి సరిత నాగ్ పూర్ లోని పోలింగ్ బూత్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే.. కుటుంబసభ్యులతో కలిసి మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ బాలాసాహెబ్ థోరట్ కూడా తన ఓటు హక్కును ఊపయోగించుకున్నారు.
సాయంత్రం కల్లా మరికొందరు ప్రముఖులు కూడా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాగా, ఈ రోజు ఉప ఎన్నికలు స్థానాలు ఇలా ఉన్నాయి.. యూపీలో 11 - గుజరాత్ 6 - బిహార్ 5 - అస్సాం 4 - హిమాచల్ ప్రదేశ్ 2 - తమిళనాడు 2 - పంజాబ్ 4 - కేరళ 5 - సిక్కిం 3 - రాజస్తాన్ 2 - అరుణాచల్ ప్రదేశ్ - మధ్యప్రదేశ్ - ఒడిశా - చత్తీస్ గఢ్ - పుదుచ్చేరి - మేఘాలయ - తెలంగాణల్లో ఒక్కోటి చొప్పున స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఇక మహారాష్ట్రలోని సతారా - బిహార్ లోని సమస్తిపూర్ లోక్ సభ స్థానాలకు కూడా పోలింగ్ జరుగుతోంది.
ఇక తెలంగాణలోని హుజూర్ నగర్ పోలింగ్ జోరుగా జరుగుతోంది. మొత్తం 302 పోలింగ్ కేంద్రాల్లో 1708 ఈవీఎంలు ఏర్పాటు చేశారు. ప్రతీ పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు 144 సెక్షన్ ను విధించారు. ఇప్పటికే 25 శాతం పోలింగ్ కంప్లీట్ అయ్యింది. ఇక టీఆర్ ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఓటు హక్కు వినియోగించుకోగా... కాంగ్రెస్ అభ్యర్థిని పద్మావతి ఓటు హక్కు కోదాడలో ఉండడంతో ఆమె వినియోగించోలేకపోయారు.