ఆంధ్రప్రదేశ్‌లో 2020తో పోలిస్తే 2021లో ఎస్సీలపై నేరాలు 3.28 శాతం, ఎస్టీలపై నేరాలు 12.81 శాతం పెరిగాయి. గతేడాది దేశవ్యాప్తంగా ఎస్సీలపై జరిగిన నేరాల్లో 3.95, ఎస్టీలపై చోటుచేసుకున్న నేరాల్లో 4.10 శాతం ఏపీలోనే నమోదయ్యాయి. దళితులు, గిరిజనులపై అత్యధిక నేరాలు జరుగుతున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ 7వ స్థానంలో ఉంది. 2020లో 8వ స్థానంలో ఉండేది. వారిపై నేరాలు పెరగటంతో ఈ విషయంలో పైకి ఎగబాకింది. ఈ మేరకు 2021లో జరిగిన నేరాలకు సంబంధించి జాతీయ నేర గణాంక సంస్థ తాజాగా నివేదిక ఇచ్చింది.
దీనిని బట్టి.. ఏపీలో పరిస్థితి ఎలా ఉందో అర్ధం అవుతుంది. ఒకవైపు ప్రభుత్వం మాత్రం.. ఏపీలో అంతా బాగుందనే కలరింగ్ ఇస్తుండడం.. మరోవైపు.. ఏమీ బాగోలేదనే పరిస్థితి వెరసి.. మొత్తంగా ఏపీలో పరిస్థితి దారుణంగా తయారైంది. దిశ చట్టం ఏమైందో ఎవరికీ తెలియని పరిస్తితి నెలకొంది.
ఏటికేడు పెరుగుతున్న నేరాలు!
ఏపీలో ఎస్టీలపై నేరాల రేటు(13.7 శాతం) జాతీయ స్థాయి(8.4 శాతం) కంటే చాలా ఎక్కువగా ఉంది. దేశం లో ప్రతి లక్ష మంది ఎస్టీ జనాభాకు 8.4 నేరాలు జరుగుతుండగా.. ఏపీలో మాత్రం 13.7 శాతం నేరాలు జరుగుతు న్నాయి. ఎస్టీలపై నేరాల రేటు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ అయిదో స్థానంలో ఉంది.
రాష్ట్రంలో ప్రతి లక్ష మంది ఎస్సీ జనాభాకు 23.8 నేరాలు జరుగుతున్నాయి. ఈ నేరాల రేటూ ఎక్కువే ఉంది. మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించిన ఘటనలు దేశంలోనే అత్యధికంగా ఏపీలోనే చోటుచేసుకున్నాయి. దేశవ్యాప్తంగా గతేడాది ఇలాంటి ఘటనలపై 7,788 కేసులు నమోదవగా.. అందులో 2,370 (30.43%) ఆంధ్రప్రదేశ్‌లోనే చోటుచేసుకోవడం గమనార్హం.
ఏది ఎస్‌వో ఎస్!!
పనిచేసే చోట మహిళలకు రక్షణ కల్పిస్తామంటూ.. ప్రభుత్వం ఆర్భాటంగా చెబుతోంది. అయితే.. ఇది.. ఎక్కడా అమలు కావడం లేదు. ముఖ్యంగా దిశ యాప్ ద్వారా ఎస్ వోఎస్ బటన్ నొక్కగానే నేరాలను అరికడతామని.. క్షణాల్లో పోలీసులు వస్తారని.. ఇది అద్భుతంగా ఉంటుందని చెబుతున్నా.. ఆ తరహా పరిస్థితి లేనేలేదని ప్రస్తుతం ఉన్న రిపోర్టు స్పష్టం చేస్తోంది. పని చేసే చోట, ప్రజారవాణాలో ఈ తరహా వేధింపులు అధికంగా జరుగుతున్నాయి. 2020లో ఈ తరహా ఘటనలపై ఏపీలో 2,342 కేసులు నమోదవగా.. గతేడాది ఆ సంఖ్య 2,370కు పెరిగింది.
ఆంధ్రప్రదేశ్‌లో హత్యలు, అత్యాచారాలు విపరీతంగా పెరిగాయి. 2020లో 853 హత్యలు జరగ్గా.. 2021లో 956 చోటుచేసుకున్నాయి. అంతకు ముందు ఏడాది కంటే ఏకంగా 103 హత్యలు ఎక్కువగా జరిగాయి. హత్యల్లో పెరుగుదల 12.07 శాతం.* మహిళలపై అత్యాచార ఘటనలూ ఎక్కువయ్యాయి.
2020లో 1095 అత్యాచార ఘటనలు జరగ్గా.. 2021లో 1,188 ఘటనలు చోటుచేసుకున్నాయి. అంతకు ముందు ఏడాది కంటే 93 కేసులు అధికంగా నమోదయ్యాయి. అత్యాచారాలు 8.49 శాతం పెరిగాయి. వీటిలో అత్యధిక శాతం నిందితులు బాధితులకు బాగా పరిచయస్తులే కావడం గమనార్హం.
నేరాల్లో నాలుగో సింహం!!
పోలీసులే చట్ట ఉల్లంఘనలు, నేరాలకు పాల్పడుతున్న ఘటనలు అత్యధికంగా జరిగిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలో 5వ స్థానంలో నిలిచింది. బిహార్ (4,062), మహారాష్ట్ర (448), రాజస్థాన్ (245), గుజరాత్ (209) కేసులతో తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. 185 కేసులతో ఆంధ్రప్రదేశ్ అయిదో స్థానంలో ఉంది. గతేడాది దేశవ్యాప్తంగా పోలీసులపై 6,164 కేసులు నమోదవగా.. వాటిలో 3 శాతం కేసులు ఏపీ పోలీసులపైనే నమోదయ్యాయి. మరి దీనిని బట్టి జగనన్న పాలన అర్ధమవుతోందని అంటున్నారు టీడీపీ నాయకులు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.