పత్రికలు, మీడియాకు సెన్సార్ ఉంది. కానీ డిజిటల్ మీడియాను కంట్రోల్ చేసే వ్యవస్థలు దేశంలో లేవు. అందుకే అందులో ఏం రాసినా.. చూపినా ప్రజల్లోకి వెళ్లి వైరల్ అవుతోంది. కొందరు దీన్ని దుర్వినియోగం చేస్తూ పట్టపగ్గాల్లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే డిజిటల్ మీడియాలో చోటుచేసుకుంటున్న ఆగడాలపై నియంత్రణ లేకుండా పోయింది. ఈక్రమంలోనే కేంద్రం తాజాగా కొరఢా ఝలిపించబోతోంది.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం (ఐటీయాక్ట్) ద్వారా ఆంక్షల కత్తికి మరింత పదును పెడుతోంది. కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ ఈ మేరకు నోటిఫికేషన్ ను సృష్టించింది. ఈనెల 28 నోటిఫికేషన్ జారీ చేసింది. ఐటీయాక్ట్ ను 2020లో ఆమోదించగా.. 2021 ఫిబ్రవరిలో రూల్స్ ను అమల్లోకి తెచ్చారు.
రానురాను డిజిటల్ మీడియాలో అనేక పోకడలు ఇబ్బందికరంగా మారడంతో తాజాగా మరోసారి 'ది ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ సవరణ నియమాలు -2022' నోటిఫికేషన్ ను కేంద్రం జారీ చేసింది. దీంతో సోషల్ మీడియా, వెబ్ సైట్ లు, ఆన్ లైన్ ప్రచార మాధ్యమాలు తదితర డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లపై మరిన్ని ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.
ఈ చట్టం ముఖ్య ఉద్దేశం అసత్యాలు, అర్థసత్యాలు, అశ్లీలం , మోసాలు, హింసను ప్రేరేపించడం, కించపరిచే చర్యలతో అడ్డూ అదుపులేకుండా రెచ్చిపోయే కొందరు డిజిటల్ మీడియా నిర్వాహకులపై ఐటీ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తప్పవు. ప్రధానంగా లోన్ యాప్స్ మోసాలపై డిజిటల్ మీడియాలో ప్రత్సహించకుండా ఐటీయాక్ట్ పరిధిలోకి తెచ్చి చర్యలు తీసుకుంటారు.
డిజిటల్ మీడియా ఖాతా కోసం ఒక వ్యక్తి ఇచ్చే వ్యక్తిగత సమాచారంపై మరొక వ్యక్తికి ఎలాంటి హక్కు ఉండదు. దీన్ని ఉల్లంఘించి వ్యక్తిగత సమాచార గోప్యతకు భంగం కలిగించేలా వేరొకరు వ్యవహరించకూడదు లాంటి కఠిన చట్టాలను అమలు చేస్తున్నారు. దీన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకునే దిశగా చట్టాలు చేశారు.