కేంద్రం ‘వసూల్ రాజా’

Update: 2021-05-02 04:30 GMT
ఓవైపు దేశ ప్రజలందరికీ కరోనా లాక్ డౌన్ తో.. ఇప్పుడొచ్చిన సెకండ్ వేవ్ తో  ఆదాయం తగ్గుతున్న వేళ..  కేంద్రంలోని మోడీ సర్కార్ కు మాత్రం ఇంత కరువులోనూ భారీగా ఆదాయం వచ్చిపడుతుండడం విశేషంగా మారింది.

ఏప్రిల్ నెలలో జీఎస్టీ వసూళ్లు కొత్త రికార్డును సృష్టించాయి. గత నెలలో రూ.1.41 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్లు కేంద్ర ఆర్థికశాఖ సంచలన నివేదికను బయటపెట్టింది.

వరుసగా 7వ నెల కూడా జీఎస్టీ వసూళ్లు రూ. లక్ష కోట్ల మార్కును దాటడం విశేషంగా చెప్పొచ్చు. దీన్ని బట్టి జీఎస్టీ ద్వారా కేంద్రానికి వసూళ్ల వర్షం కురుస్తున్నట్టుగా తెలుస్తోంది.

జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఈ స్తాయిలో వసూళ్లు రావడం ఇదే తొలిసారి అని.. దీనిలో కేంద్ర జీఎస్టీ రూ.27837 కోట్లు వచ్చినట్టు తెలుస్తోంది.

ఇక రాష్ట్ర జీఎస్టీ రూ.35621 కోట్లు, సమీకృతి జీఎస్టీ రూ.68478 కోట్లు, సెస్ రూపంలో రూ.9445 కోట్ల మేర ఆదాయం సమకూరిందని తేలింది.
Tags:    

Similar News