వాళ్లు బీజేపీకి ఓటేయమంటున్నారట..!!

Update: 2019-04-24 06:38 GMT
పశ్చిమ బెంగాల్ లో ఓటింగ్ సరళిని పరిశీలించిన తృణమూల్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. బెంగాల్లో కొన్ని ప్రాంతాల్లోని పోలింగ్ బూత్ లలో కేంద్ర బలగాల సైనికులు కూర్చొని బీజేపీకి ఓటు వేయాలంటూ ఓటర్లకు చెబుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర బలగాలు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని.. వారికి ఆ హక్కు ఎక్కడిది అని ప్రశ్నించారు.

ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని గెలిపించడానికి కేంద్ర బలగాలు, ఎన్నికల సంఘం కష్టపడుతున్నాయని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. పోలింగ్ బూత్ లలో ఇది కనిపిస్తోందని స్పష్టం చేశారు.

ఇక బీజేపీ అగ్రనాయకులకు అనుకూలంగా ఎన్నికల సంఘం షెడ్యూల్ రూపొందించిందని.. వారు అన్ని రాష్ట్రాల్లో ప్రచారం చేసుకోవడానికి వీలుగా ఈసీ సహకరించిందని దీదీ ఆరోపించారు. అందుకే మూడు వారాల్లోగా ముగియాల్సిన సార్వత్రిక ఎన్నికలను మూడు నెలలకు పొడిగించారని మమత బెనర్జీ ఫైర్ అయ్యారు. బీజేపీ ఎంత చేసినా.. ఎన్ని  కుయుక్తులు పన్నినా గెలవడం అసాధ్యమంటూ మమతా ఫైర్ అయ్యారు.
    

Tags:    

Similar News