ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతానికి ఎట్టి పరిస్థితుల్లోనూ సాగునీళ్లు అందించకూడదని కొందరు చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావడం లేదు. తాజాగా కేంద్ర అటవీ పర్యావరణశాఖ ఇచ్చిన నివేదిక చూస్తే అది అర్థమైపోతుంది. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి సాధ్యమైనంత త్వరగా ప్రతి ఎకరాకు సాగునీళ్లు అందించాలని జగన్ ప్రభుత్వం చేస్తున్నప్రయత్నాలకు కేంద్ర అటవీ పర్యావరణశాఖ తాజాగా ఇచ్చిన నివేదిక కొంతమేర సహాయంగా నిలుస్తుంది సాగునీటి నిపుణులు చెబుతున్నారు. అనుమతి లేకుండానే రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును చేపట్టారంటూ తెలంగాణ నివాసి అభ్యంతరాల మేరకు జాతీయ హరిత ట్రైబ్యునల్ చెన్నై బెంచి విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే.
ఇందులో కేంద్రప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చారు. తెలంగాణ ప్రభుత్వం సైతం ఈ కేసులో జత చేరింది. ప్రాజెక్టు నిర్మాణ పనులు జరుగుతున్నాయో లేదో గమనించి నివేదిక ఇవ్వాలని గతంలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డును గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశించింది. బోర్డు ఏర్పాటుచేసిన కమిటీ సీమ ఎత్తిపోతలను సందర్శించి డీపీఆర్ తయారీకి అవసరమైన పనుల కన్నా మించి అక్కడ నిర్మాణ పనులు సాగుతున్నాయని నివేదిక ఇచ్చింది. దీనిపై ఏపీ ప్రభుత్వం తన అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర అటవీ, పర్యావరణశాఖలు నివేదిక ఇవ్వాలని ఎన్జీటీ ఆదేశించింది.
దీంతో కేంద్ర అటవీ పర్యావరణశాస్త్రవేత్త పసుపులేటి సురేష్ బాబు ఈ నెల 6న రాయలసీమ ఎత్తిపోతల ప్రాంతాన్ని సందర్శించారు. తాజాగా దీనిపై నివేదిక సమర్పించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులు జరగడం లేదని కేంద్ర అటవీ పర్యావరణశాఖ శాస్త్రవేత్త పసుపులేటి సురేష్‌బాబు నివేదిక ఇచ్చారు. ప్రాజెక్టు నిర్మాణ పనులు కొనసాగుతున్న లక్షణాలు ఏమీ అక్కడ లేవని, పనుల్లో పురోగతి లేదని పేర్కొన్నారు. నిర్మాణ పనుల కోసం గతంలో సమీకరించుకున్న మెటీరియల్ అంతా అక్కడే ఉన్న విషయాన్ని గుర్తించినట్లు తెలిపారు. రాయలసీమ ఎత్తిపోతలపై జాతీయ హరిత ట్రైబ్యునల్ చెన్నై బెంచిలో కేసు విచారణ సాగుతున్న విషయం తెలిసిందే.