పౌరసత్వం పై కేంద్రం సంచలన ప్రకటన

Update: 2020-01-02 05:09 GMT
పాకిస్తాన్, బంగ్లాదేశ్, అప్ఘనిస్తాన్ లో మైనార్టీలైన హిందువులకు భారత పౌరసత్వం కల్పించే ‘పౌరసత్వ సవరణ చట్టం’పై కేంద్రం మరోసారి విస్పష్టమైన ప్రకటన చేసింది. దీని పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘హిందువులకు ఉన్నది ఒక్కటే భారతేనని.. తాము కూడా కాదంటే వారు ఎక్కడికెళ్తారని’ ప్రశ్నించారు. ఆయా దేశాల్లోని మైనార్టీలైన హిందువులకు భారత పౌరసత్వాన్ని కల్పించడం తమ నైతిక బాధ్యత అని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. హిందూ శరాణార్థులు భారత్ ను కాదని ఇటలీకి పొమ్మంటారా అని ప్రశ్నించారు. వాళ్లు పౌరసత్వం ఇస్తారా అని నిలదీశారు.

పౌరసత్వ సవరణ చట్టం పై యాగీ చేస్తున్న ఆందోళనకారులు ఎవరికి మద్దతిస్తున్నారో స్పష్టం చేయాలని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.పొరుగు దేశాల్లో దుర్భరంగా పనిచేస్తున్న హిందువులకు వ్యతిరేకంగా 23 ప్రతిపక్షాలు ఆందోళన కు దిగడం దారుణమన్నారు. ప్రతిపక్ష నేత రాహుల్ కు అసలు చట్టాలపై అవగాహన లేకుండా విమర్శిస్తున్నారని.. ముందు తేడా తెలుసుకోవాలని కౌంటర్ ఇచ్చారు.
Tags:    

Similar News