ఇంటర్నెట్ నిలిపివేత వదంతులపై కేంద్రం క్లారిటీ

Update: 2020-03-27 17:30 GMT
కరోనా...ప్రస్తుతం సోషల్ మీడియా - మీడియా - ఇంటర్నెట్ లో ఈ పదం మార్మోగిపోతోంది. కరోనాపై అవగాహన పెంచేందుకు సెలబ్రిటీలు - సినీ తారలు - పొలిటిషియన్లు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక, వైద్యులు - ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎన్నో సలహాలు - సూచనలు - ముందు జాగ్రత్తలు చెబుతోంది. అయినప్పటికీ కరోనాపై కొన్ని వదంతులు ప్రచారంలో ఉన్నాయి. మరోవైపు, కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ పై కూడా చాలా పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. భారత్ లో ఇపుడున్న లాక్ డౌన్ మరో 3 నెలలు పొడిగిస్తారని....త్వరలోనే ఇంటర్నెట్ కూడా నిలిపి వేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ పుకార్లకు తెరదించుతూ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రచారాన్ని నమ్మవద్దని - ఇంటర్నెట్ సేవలు యథావిధిగా కొనసాగుతాయని చెప్పింది.

లాక్ డౌన్ నేపథ్యంలో భారత ప్రజలంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. దీంతో, ఇంటర్నెట్ వాడకం పెరిగింది. దీంతో, బ్యాండ్ విడ్త్ తగ్గించుకోవాలని ఓవర్ ది టాప్(ఓటీటీ) సంస్థలను కేంద్రం కోరింది. దానికి ఆ సంస్థలు అంగీకరించాయి. దాంతో పాటు హెచ్ డీ క్వాలిటీకి బదులు ఎస్ డీ క్వాలిటీ ఇవ్వాలని ఓటీటీ సంస్థలు నిర్ణయించుకున్నాయి. వీటితో పాడు యాడ్స్. పాపప్స్ ను తొలగించాలని నిర్ణయించాయి. ఈ చర్యల ద్వారా తక్కువ ఇంటర్నెట్ సర్వర్ల మీద భారాన్ని తగ్గించాలని ఆ సంస్థలు భావించాయి. దీనిని ప్రచారం చేస్తూ ఇంటర్నెట్ నిలిపివేస్తున్నారని పుకార్లు వస్తున్నాయి. ఇవి నిజం కాదని తాజాగా కేంద్రం తేల్చి చెప్పింది.

   

Tags:    

Similar News