ఒమిక్రాన్ దెబ్బకు మళ్ళీ దేశంలో నైట్ కర్ఫ్యూలు తప్పేట్లు లేదు. ఒకవైపు కరోనా వైరస్ కేసులు మళ్ళీ మెల్లిగా పెరుగుతుండటం మరోవైపు ఒమిక్రాన్ కేసుల తీవ్రత పెరిగిపోతున్న నేపథ్యంలో కర్ఫ్యూ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. అన్నీ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం శనివారం అప్రమత్తం చేసింది. వెంటనే నైట్ కర్ఫ్యూ విధించే అంశాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోమని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టంగా చెప్పింది.
10 రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 27 జిల్లాల్లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ కేసులను కచ్చితంగా స్క్రీనింగ్ చేయటం కోసం విదేశాల నుండి వచ్చే ప్రయాణీకులను ఒకటికి రెండుసార్లు పరీక్షించాలని కేంద్రం ఆదేశాలు జారీచేసింది. విదేశాల నుండి వచ్చే ప్రయాణికులు వాళ్ళు దిగిన విమానాశ్రయాలతో పాటు ఆ తర్వాత వాళ్ళు వెళ్ళే రాష్ట్రాల్లోని పర్మినెంట్ అడ్రస్ ను కచ్చితంగా తీసుకోవాలని కేంద్రం అన్నీ విమానాశ్రయాలకు ఆదేశాలు జారీచేసింది.
విదేశాల నుండి ముంబాయ్, ఢిల్లీ, చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ లాంటి విమానాశ్రమాల్లో దిగిన ప్రయాణీకుల్లో కొందరి అడ్రస్ దొరకటంలేదు. మొబైల్ ఫోన్లు స్విచ్చాఫ్ చేసుకోవటం, తప్పుడు అడ్రస్ లు ఇవ్వటంతో వాళ్ళ పరిస్ధితిని ఫాలోఅప్ చేయటం కేంద్రానికి కానీ రాష్ట్రాలకు కానీ చాలా ఇబ్బందులుగా మారుతోంది. ఇలాంటి వాళ్ళ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవటంలో ప్రభుత్వాలకు అర్ధం కావటంలేదు.
మిగిలిన దేశాల నుండి వచ్చే ప్రయాణీకుల తీరు ఒకరకంగా ఉంటే దక్షిణాఫ్రికా నుండి వచ్చే వారి వ్యవహారమే సమస్యగా మారింది. అనుమానితులకు పరీక్షలు చేయటం, వ్యాక్సినేషన్ ప్రక్రియను పెంచటం, కంటోన్మెంట్ జోన్లను గుర్తించి తప్పదనుకుంటే వెంటనే నైట్ కర్ఫ్యూను ప్రకటించేయాలని కేంద్రం చెప్పింది. 3 రాష్ట్రాల్లోని 8 జిల్లాల్లో కోవిడ్ పాజిటివిటి రేటు 10 శాతంకన్నా ఎక్కువగా ఉంది. 7 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 5-10 పాజిటివిటి ఉందని కేంద్రం చెప్పింది.
ఇదే సమయంలో ప్రపంచంలోని 67 దేశాలకు ఒమిక్రాన్ చాలా వేగంగా పాకుతోంది. దక్షిణాఫ్రికా నుండి వచ్చే విమానాలను 25 దేశాలు నిషేధించినా కేసుల తీవ్రత మాత్రం పెరిగిపోతోంది. ఒమిక్రాన్ కేసులను ఎలా నియంత్రించాలో ఆయా దేశాలకు అర్ధం కావటంలేదు. మళ్ళీ చాలా దేశాల్లో హెల్త్ ఎమర్జెన్సీని విధించే ఆలోచనలో వివిధ దేశాలున్నట్లు సమాచారం. మొత్తానికి కరోనా వైరస్ తగ్గిపోయిందని అనుకుంటే ఒమక్రాన్ రూపంలో ప్రపంచాన్ని వణికించేస్తోంది.