పేదవాళ్లను కూడా వదలవా 'మోడీజీ'!?

Update: 2021-03-05 07:35 GMT
'కాదేది పెంపుకు అనర్హం' అన్నట్టుగా మారింది మోడీ సర్కార్ హయాంలో.. అసలే కరోనా కల్లోలంలో ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయి అరిగోసపడుతున్న ప్రజలపై మోడీ సార్  ధరలతో వీరబాదుడు బాధుతున్నాడన్న ఆవేదన సామాన్యుల నుంచి వినిపిస్తోంది.. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యావసరాలు ఆకాశాన్ని అంటాయి. ధరల పెంపుతప్పితే తగ్గించడం అన్నదే లేకుండా పెంచేస్తున్నారు.

ఈ బాదుడు చాలదన్నట్టు పేదవాళ్లపై మరో భారం మోపారు మోడీజీ.. రైల్వే స్టేషన్లలో ఫ్టాట్ ఫాం టికెట్ల ధరను రైల్వే శాఖ పెంచడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం స్టేషన్లలో ఫ్లాట్ ఫాం టికెట్ ధర రూ.10 ఉండగా.. దాన్ని ఏకంగా మూడింతలు చేసి రూ.30కి పెంచింది. అలాగే లోకల్ రైళ్లలో కనీస చార్జిగా రూ.30 నిర్ణయించారు.

కరోనా సమయంలో అనవసర ప్రయాణాలను పెంచకూడదన్న ఉద్దేశంతోనే  ఈ చార్జీలను పెంచినట్లు రైల్వేశాఖ కవర్ చేసుకునే ప్రయత్నం చేసింది. ఫ్టాట్ ఫామ్ పై ఎక్కువ మంది గుమిగూడకుండా చూడటం కోసమే ఫ్లాట్ ఫాం టికెట్ల ధరలను పెంచినట్లు సెలవిచ్చింది.  మొత్తంగా ప్రజలను ఎడాపెడా  వాయించినట్టు అర్తమవుతోంది.కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు ఇప్పుడు ధరలు పెంచడానికి కేంద్రానికి బోలెడు కారణాలు కనిపిస్తున్నాయి. కరోనా వైరస్ కూడా ఇందుకు బూచీగా కనపడడమే మన దరిద్రం అని ప్రజలు విసుక్కుంటున్నారు.
Tags:    

Similar News