ప్రతి ఒక్కరూ పుట్టిన తేదీ చెప్పాల్సిందే ...ఎన్పీఆర్ పై కేంద్రం మరో కీలక ప్రకటన !
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోని దేశంలో అమలు చేయాలని చూస్తున్న జాతీయ పౌర పట్టిక(ఎన్పీఆర్) పై మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే దేశంలో ని పలువురు దీన్ని వ్యతిరేకిస్తుండగా ..కేంద్రం మాత్రం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య ఎప్పుడైనా నిర్ణీత షెడ్యూల్ లో జనగణనతో పాటు ఎన్పీఆర్ ను ఏకకాలంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా మీ పుట్టుపూర్వోత్తరాలు చెప్పాల్సి ఉంటుంది. జాతీయ పౌరపట్టిక, మీ మూలాలను తేల్చనుంది. మీ తల్లిదండ్రులు ఎక్కడి వారో నమోదు చేయనుంది. వారు బతికున్నా లేకపోయినా వారి పేర్లనూ రికార్డు చేయనుంది. మీ కుటుంబసభ్యులు ఇంట్లో లేకపోయినా, ఏదైనా ప్రాంతంలో ఉద్యోగం, ఉపాధి నిమిత్తం వెళ్లినా, అక్కడ నమోదు చేసుకోకపోతే మీ దగ్గరే వారి పేర్లు, వివరాలను నమోదు చేసుకోనుంది.
అలాగే మీకు పుట్టిన రోజు లేదు. అలాగే మీరు చదువుకోలేదు? కాబట్టి సర్టిఫికెట్స్ కూడా ఉండే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితుల్లో ... జాతీయ పౌర పట్టిక నమోదు చేయడానికి వచ్చే ఎన్యూమరేటర్లు మీ పుట్టిన తేదీ నిర్ధారించేందుకు అన్ని అవకాశాలనూ పరిశీలిస్తారు. అది ఎలా అంటే ..మీరు వర్షాకాలంలో పుట్టారా? ఎండాకాలంలో పుట్టారా ? దసరా టైం లో పుట్టారా అని తెలుసుకుంటారు. అప్పుడు ఏ మీరు చెప్పే సమాధానాన్ని బట్టి మీ పుట్టిన తేదీ నిర్ధారించేందుకు ప్రయత్నిస్తారు. అప్పటికీ మీ పుట్టిన తేదీని తేల్చడం కష్టమైతే .. మీ కుటుంబ వివరాలు తెలుసుకునేందుకు వచ్చిన వారే మీ శారీరక పరిస్థితి, మీ కుటుంబసభ్యుల వయసు, మీ పిల్లల వయసు ఆధారం గా మీ పుట్టిన తేదీ ఖరారు చేసి నమోదు చేస్తారు.
ఎన్పీఆర్ తయారీ మార్గదర్శకాలు ఇవే ...
ప్రతి కుటుంబానికి తాత్కాలిక ధ్రువీకరణ సంఖ్య కేటాయిస్తారు. అందులో రాష్ట్రం, జిల్లా, మండలం, పట్టణం లేదా గ్రామాలకు కోడ్ నంబర్లు ఉంటాయి. ఆ తర్వాత 2010, 2015లో రూపొందించిన డేటా ప్రకారం ఇంటి అడ్రస్ సరిచూస్తారు. అవసరమైతే చిరునామా మారుస్తారు. ఇందులో పిన్‌కోడ్ తప్పనిసరిగా నమోదు చేయాలి.
ఇంట్లో ఉంటున్న వారి సంఖ్య నమోదు చేసి, ప్రతి ఒక్కరికి సీరియల్ నంబర్ కేటాయిస్తారు. ఈ సంఖ్య ఆధారంగా ప్రతి వ్యక్తి పూర్తి పేరు, యజమానితో బంధుత్వం, ఎన్యూమరేటర్ వెళ్లినప్పుడు ఆ వ్యక్తి ఇంట్లోనే ఉన్నారా.. లేదా.. ఎక్కడికి వెళ్లారనే విషయాలను నమోదు చేస్తారు.
ప్రతి వ్యక్తికి సంబంధించి వివాహమైందా? లేదా అనే అంశాన్ని వయసుతో సంబంధం లేకుండా నమోదు చేసుకుంటారు. అలాగే కుటుంబంలో అందరి పుట్టిన రోజులు ఇంగ్లిష్ క్యాలెండర్ ప్రకారం నమోదు చేస్తారు.
కుటుంబంలోని ప్రతి వ్యక్తి ఎక్కడ పుట్టారనే నే విషయాన్ని విడివిడిగా రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం లేదా పట్టణం లాంటి వివరాలను నమోదు చేస్తారు. అప్పుడు ఆ వ్యక్తి భారతీయుడా? కాదా అనేది నిర్ధారిస్తారు. జాతీయత విషయంలో కుటుంబంలోని అందరిని అడిగి రికార్డు చేసుకుంటారు.
పాస్‌పోర్టు నంబర్, విద్యార్హతల వివరాలు, వృత్తి, మాతృ భాషలాంటి సమాచారాన్ని కోడ్ ఆధారంగా నమోదు చేస్తారు.
మీతో పాటు మీ నివాసంలోనే పనిమనిషులు శాశ్వతంగా ఉంటే వారి పేర్లను కూడా మీ కుటుంబ వివరాల్లోనే నమోదు చేసుకుంటారు.
మిలిటరీ ఏరియాలు, బయటప్రాంతాల్లో నివసించే రక్షణ సిబ్బంది వివరాలను ప్రత్యేకంగా తీసుకుంటారు. వారి వివరాలను సంబంధిత విభాగాలతో చర్చించిన తర్వాతే జాబితాలో పొందుపరుస్తారు.
యాచకులు, వలసజీవులు, సంచార జీవులు, ప్లాట్ ఫారాలు, బస్ స్టేషన్లు, పార్కుల్లో ఉండేవారి వివరాలను కూడా ఈసారి ఎన్పీఆర్ లో నమోదు చేయనున్నారు.
కుటుంబ శాశ్వత చిరునామా, ఆ ఇంట్లో ఎంత కాలం నుంచి ఉంటున్నారు. గతంలో ఆ కుటుంబ వివరాలు ఎన్పీఆర్ లో నమోదయ్యాయా? లేదా అనే విషయాలను కూడా చూస్తారు. ఆధార్, మొబైల్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ నంబర్లను లభ్యతను బట్టి తీసుకుంటారు. ఈ మొత్తం వివరాలని కలిపి ప్రతి కుటుంబానికి ఒక సంగ్రహ నివేదికను ఇంటికొచ్చిన ఎన్యూమరేటర్ తయారు చేస్తారు.