డిజిటల్ మీడియా గొంతు నొక్కేయాల్సిందేనన్నమాట..

Update: 2020-09-17 17:36 GMT
ప్రింట్ మీడియా కాలం చెల్లిపోయింది. ఎలక్ట్రానిక్ మీడియాను చూసే కాలం పోయింది. ఇప్పుడు అంతా డిజిటల్ మీడియానే. ప్రజలంతా రిపోర్టర్లే. ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో దాన్ని ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్ లలో పోస్టు చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అత్యంత వేగంగా డిజిటల్ మీడియా దేశంలో పవర్ ఫుల్ గా ఉంది. ఇందులో ఎంత నిజాలు ఉన్నాయో.. వైరల్ కోసం కొందరు చేసే అతి వల్ల అన్నీ అబద్దాలున్నాయి.

అయితే మీడియా నియంత్రణకు సంబంధించి సుప్రీం కోర్టులో ఈరోజు జరిగిన విచారణలో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. మీడియా నియంత్రణకు సంబంధించి తొలుత నియంత్రించాల్సి వస్తే డిజిటల్ మీడియాపైనే చర్యలు చేపట్టాలని తెలిపింది.

వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా సమాచారం క్షణాల్లో వైరల్ గా మారిపోతుండడమే ఇందుకు కారణంగా పేర్కొంది. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఇప్పటికే సరిపడా నిబంధనలు ఉన్నాయని కాబట్టి విచ్చలవిడిగా వైరల్ చేసే డిజిటల్ మీడియానే నియంత్రించాలని కేంద్రం సుప్రీం కోర్టుకు తెలిపింది.

డిజిటల్ మీడియాకు కూడా నియంత్రణ సంకెళ్లు వేస్తే ఇక గొంతెత్తే గళాలకు అడ్డుకట్ట వేసినట్టే. దీనిపై సుప్రీం కోర్టు ఎలా స్పందిస్తున్నది చూడాలి. అయితే ఎవరి ఫోన్ ద్వారా వారు స్పందించే డిజిటల్ విప్లవంలో దీని నియంత్రణ సాధ్యమా అన్నది ఇక్కడ ప్రశ్న అని మేధావులు అనుకుంటున్నారు. డిజిటల్ మీడియాను నియంత్రించడం కష్టమంటున్నారు.
Tags:    

Similar News