సాఫ్ట్‌ వేర్‌ - స్టార్టప్‌ కంపెనీలకు కేంద్రం శుభవార్త..ఏంటంటే!

Update: 2020-04-17 09:50 GMT
కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి విధించిన లాక్ డౌన్ కారణంగా ఆర్థికరంగం పై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ఐటీ కంపెనీలు బాగా దెబ్బ తిన్నాయి. చాలా కంపెనీలు లాక్ డౌన్ ఎఫెక్ట్ తో ఉద్యోగులను తొలగిస్తున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో చిన్న - మధ్యతరహా సాఫ్ట్‌ వేర్‌ - స్టార్టప్‌ కంపెనీలకు కేంద్రం ఒక శుభవార్త చెప్పింది.

సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ  పార్క్‌ లలో ఉంటున్న కంపెనీల అద్దెలను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి నుంచి జూన్‌ వరకు నాలుగు నెలల పాటు అద్దె చెల్లించనవసరం లేదని కేంద్ర సమాచార శాఖ ప్రకటించింది. ఎస్‌ టీపీఐకి దేశవ్యాప్తంగా 60 ప్రాంతాల్లో భవనాలు ఉండగా వాటిలో 200 ఐటీ - ఐటీఈఎస్ - ఎంఎస్‌ ఎఈ సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. అయితే ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో నష్టాలను చవి చూస్తున్న వారికి ఊరట నిచ్చేలా కేంద్ర ఎలక్ట్రానిక్స్ - ఐటి శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ విషయాన్ని తెలియజేసారు.

భారతదేశంలోని 60 ఎస్‌ టిపిఐ కేంద్రాల నుండి పనిచేస్తున్న ఐటి యూనిట్లు / స్టార్టప్‌ లకు మార్చి 1 - 2020 జూన్ 30 2020 మధ్య కాలానికి అద్దె చెల్లించకుండా మాఫీ ఇవ్వబడిందని - దీనివల్ల దాదాపు 200 మందికి ప్రయోజనం ఉంటుంది. చిన్న మరియు మధ్య తరగతి యూనిట్లు 3000 ప్రత్యక్ష ఉద్యోగాలకు మద్దతు ఇస్తున్నాయి అని తెలిపారు. ఈ 4 నెలల కాలంలో ఈ యూనిట్ల కు అందించిన అద్దె మినహాయింపు మొత్తం ఖర్చు సుమారు 5 కోట్ల రూపాయలుగా  ఉంటుందని సమాచారం.
Tags:    

Similar News