కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబళిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు చనిపోయిన వారి సంఖ్య లక్ష దాటింది. అయితే , భారత్ లో కూడా రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నా కూడా - ఇతర దేశాలతో పోలిస్తే - భారత్ లో కరోనా ఉదృతి తక్కువే అని చెప్పవచ్చు. భారత్ ముందు చూపు ధోరణితో వ్యవహరించి లాక్ డౌన్ ను అమలు చేయడంతో భారత్ లో కరోనా భాదితులు తక్కువ ఉన్నారు. ఇకపోతే దేశంలో కరోనాను అరికట్టడానికి విధించిన లాక్ డౌన్ గడువు ఏప్రిల్ 14 తో ముగియబోతుంది.
దీనితో ఇప్పుడు లాక్ డౌన్ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయనే అంశం చర్చ ఎక్కువగా జరుగుతుంది. ఇందులో భాగంగా దేశంలోని అన్ని ప్రాంతాలను మూడు జోన్లుగా విభజించనున్నారు. అందులో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటే రెడ్ జోన్ .. వైరస్ లేకుంటే గ్రీన్ జోన్ గా ఎంపికచేస్తారు. ఆలా ఎంపిక చేసిన తరువాత రెడ్ జోన్ కిందకి వచ్చిన ప్రాంతాలలో మరికొన్ని రోజులపాటు లాక్ డౌన్ కొనసాగనుంది. ఈ రెడ్ జోన్ ప్రాంతంలో ఉండే వారికీ నిత్యావసర వస్తువుల కొనుగోలు కోసం మాత్రం సడలింపును ఇస్తారు. ఎల్లో జోన్.. ఇక్కడ పాజిటివ్ కేసులు సోకిన వారు ఎక్కువ మంది ఉంటారు. లాక్ డౌన్ లేకున్నా.. పరిస్థితిని మాత్రం నిశీతంగా గమనిస్తారు. చివరగా గ్రీన్ జోన్.. ఇక్కడ వైరస్ వ్యాప్తి ఉండదు.
దేశ వ్యాప్తంగా చూస్తే ..400 జిల్లాల్లో వైరస్ వ్యాప్తి లేదు. దీనితో ఆ జిల్లాల వారికి సడలింపులు ఇవ్వాలనే ప్రతిపాదన వస్తోంది. జీవితంతోపాటు జీవనోపాధి కూడా ముఖ్యమని మేధావులు సూచిస్తున్నారు. దేశంలో వైరస్ వ్యాప్తి కంట్రోల్ లో ఉంది అని వారు చెబుతున్నారు. దేశంలో ఇప్పటికే 21 రోజులు లాక్ డౌన్ విధించినందున - ఇక లాక్ డౌన్ నుండి సడలింపు వారు సూచిస్తున్నారు. దీనిపై కేంద్రం మరో రెండు రోజుల్లో తన నిర్ణయం వెలువరించే అవకాశం ఉంది.