మ‌రోసారి క్లియ‌ర్ గా చెప్పేసిన కేంద్రం..ఏపీకి నో హోదా!

Update: 2019-07-10 05:20 GMT
ఏపీకి ఇవ్వాల్సిన ప్ర‌త్యేక హోదా విష‌యంలో తన మొండిత‌నాన్ని విడిచి పెట్టేందుకు ఏ మాత్రం సిద్ధ‌ప‌డ‌టం లేదు మోడీ స‌ర్కార్. విభ‌జ‌న నేప‌థ్యంలో ఏపీకి ఇవ్వాల్సిన ప్ర‌త్యేక హోదాను ఇవ్వ‌లేన‌ని కేంద్రం మ‌రోసారి క్లియ‌ర్ గా చెప్పేసింది. ప్ర‌ధానిగా రెండోసారి బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత మోడీ స‌ర్కారు దృష్టికి అదే ప‌నిగా హోదా అంశాన్ని తీసుకెళుతున్నారు ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.

ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల్సిన అవ‌స‌రాన్ని ఆయ‌న ప‌దే ప‌దే ప్ర‌స్తావించారు. ఇదిలా ఉంటే.. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ బ‌ల్లి దుర్గాప్ర‌సాద్ అడిగిన హోదా ప్ర‌శ్న‌కు కేంద్ర హోంశాఖ స‌హాయ‌మంత్రి నిత్యానంద‌రాయ్ లిఖిత పూర్వ‌క స‌మాధానాన్ని ఇచ్చారు.

ఏపీకి ప్ర‌త్యేక హోదా అంశం మ‌రుగున‌ప‌డింద‌న్న ఆయ‌న‌.. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల‌తో ఇలాంటి ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని చెప్పారు. ఏపీకి ప్ర‌త్యేక హోదాను ఇచ్చేదే లేద‌ని తేల్చిన కేంద్రం.. హోదాకు బ‌దులుగా ప్ర‌త్యేక సాయం చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇందుకు సంబంధించి ఇప్ప‌టికే ప్ర‌త్యేక సాయం ప్ర‌క‌టించిన వైనాన్ని కేంద్ర‌మంత్రి చెప్పారు.

రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య ప‌రిష్కారం కాని విభ‌జ‌న అంశాల‌పై దృష్టి పెట్టిన‌ట్లుగా తెలిపారు. తాను ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన నాటి నుంచి ప‌లు వేదిక‌ల మీద ఏపీకి ఇవ్వాల్సిన ప్ర‌త్యేక హోదా గురించి అదే ప‌నిగా ప్ర‌స్తావిస్తున్నారు జ‌గ‌న్‌. ఇలాంటివేళ‌లో ఏపీకి హోదా ఇచ్చేది లేద‌ని స్ప‌ష్టం చేసిన కేంద్రం తీరు నేప‌థ్యంలో యువ‌నేత ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారిందంటున్నారు.


Tags:    

Similar News